Red Amaranth Curry: ఎముకల్లో క్యాల్షియం తక్కువగా ఉందా.. ఎర్రతోటకూరను తింటే సరి.. పొడికూర ఎలా చేసుకోవాలంటే

|

Jun 25, 2021 | 2:31 PM

Red Amaranth Curry: ప్రకృతి మానవుడికి ప్రసాదించిన ఆరోగ్య వరం.. ఆకుకూరలు. ప్రతి ఆకుకూరలోను అనేక పోషకాలున్నాయి. కనుక రోజుకో ఆకుకూరను ఆహారంలో..

Red Amaranth Curry: ఎముకల్లో క్యాల్షియం తక్కువగా ఉందా.. ఎర్రతోటకూరను తింటే సరి.. పొడికూర ఎలా చేసుకోవాలంటే
Red Amaranth Curry
Follow us on

Red Amaranth Curry: ప్రకృతి మానవుడికి ప్రసాదించిన ఆరోగ్య వరం.. ఆకుకూరలు. ప్రతి ఆకుకూరలోను అనేక పోషకాలున్నాయి. కనుక రోజుకో ఆకుకూరను ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చునని అంటారు. ఈరోజు ఎర్రతోటకూర తో పొడి కూర తయారీ విధానం.. ఎర్రతోటకూర తో కలిగే ప్రయోజనాలను చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు:

ఎర్రతోటకూర తరుగు- నాలుగు కప్పులు,
ఉల్లిపాయలు- రెండు,
పచ్చిమిర్చి- రెండు,
పసుపు- పావుచెంచా,
కారంపొడి- చెంచా,
ధనియాలపొడి- చెంచా,
గరంమసాలాపొడి- పావుచెంచా,
అల్లంవెల్లుల్లిముద్ద- అరచెంచా,
ఉప్పు- తగినంత,
నూనె- మూడుచెంచాలు

తయారీ:

తాజాగా ఉన్న తోటకూర ఆకులు, లేతగా ఉన్న కాడలు కూడా కలిపి సన్నగా తరిగి నీళ్లలో వేసి కడిగి నీరు పోయేవిధంగా జల్లెడలో వేసుకోవాలి. తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి.. నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో పసుపు, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కలిపి కారంపొడి, ధనియాలపొడి వేసి రెండునిమిషాలపాటు వేగిన తర్వాత ఎర్రతోటకూర తురుము, తగినంత ఉప్పు వేసి కలిపి మూతపెట్టి చిన్నమంటమీద మగ్గనివ్వాలి. నీరంతా ఊరి, ఆకుకూర మొత్తం ఉడికిన తర్వాత గరంమసాలా పొడివేసి కలిపి తడిమొత్తం పోయేంతవరకూ ఉంచి దించాలి.

ఎర్రతోటకూరతో ప్రయోజనాలు:

ఎర్రతోటకూరలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఎ, సి విటమిన్లు అధికంగా ఉండే ఆహారం ఇది. శరీరం క్యాల్షియాన్ని అందిస్తుంది. దీంతో ఎముకులకు బలం చేకూరుతుంది. బాలింతలకు, గర్భిణులకు మంచిది. ఈ ఎర్రతోటకూరను పులుసుగా కూడా చేసుకోవచ్చు.

Also Read: మోనిత విషయంలో అనుమానం వ్యక్తం చేసిన సౌందర్య.. మా పెళ్లి జరగకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించిన మోనిత