Digestive Issues : ఉదర సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహార పదార్థాలు తినడం మానుకోండి..

Digestive Issues : పొట్ట శరీరంలో ముఖ్యమైన భాగం. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని అందిస్తుంది.

Digestive Issues : ఉదర సమస్యలతో బాధపడుతున్నారా..! అయితే ఈ ఆహార పదార్థాలు తినడం మానుకోండి..
Digestive System

Updated on: Aug 12, 2021 | 9:45 AM

Digestive Issues : పొట్ట శరీరంలో ముఖ్యమైన భాగం. మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి శక్తిని అందిస్తుంది. రకరకాల ఎంజైమ్‌లను విడుదల చేస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది ఉదర సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి కారనం ఏదిపడితే అది తినడమే. ఇలాంటి సమస్యలు వచ్చినవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. పండ్లు, కూరగాయలను కడగకుండా తినడం – పండ్లు, కూరగాయలపై హానికరమైన పురుగుమందులు, ఎరువుల అవశేషాలు ఉంటాయి. మీరు కడిగిన తర్వాత తినాలి. లేదంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందువల్ల తినడానికి ముందు పండ్లు, కూరగాయలను కొంతసేపు నీటిలో ఉంచాలి.

2. తక్కువ ఉడికించిన మాంసం, సీఫుడ్ – తక్కువ ఉడికించిన మాంసం, సీఫుడ్ తినడం ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే ఇందులో సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి తినడం వల్ల ఫుడ్ పాయిజన్, కడుపు సమస్యలకు దారితీస్తుంది.

3. ముడి పాలు – కొన్నిసార్లు డైరీ ఉత్పత్తులను తినడం వల్ల కడుపు సమస్యలు తలెత్తుతాయి. పచ్చి పాలు తాగడం వల్ల అజీర్ణం కలుగుతుంది. అప్పుడు పాలతో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి. ఇది కాకుండా ఫిల్టర్ లేకుండా నీరు తాగవద్దు. వీటిని తాగడం వల్ల అనేక రకాల వ్యాధులు వ్యాపిస్తాయి.

4. అధిక పరిమాణంలో ఉప్పు, చక్కెర వినియోగం – ఆహారం, పానీయాలలో చక్కెర, ఉప్పు వినియోగాన్ని పరిమితం చేయండి. ఈ వస్తువుల అధిక వినియోగం ఆరోగ్యానికి హానికరం.

5. టీ, కాఫీ వినియోగం – టీ, కాఫీలో కెఫిన్ ఉన్నందున వాటిని ఎక్కువగా తీసుకోవద్దు. అధిక మొత్తంలో కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలకు దారితీస్తుంది.

6. స్పైసీ ఫుడ్ – మసాలా దినుసులు ఆహార రుచిని పెంచడానికి పని చేస్తాయి. కానీ అధికంగా తీసుకోవడం హానికరం. ఈ పదార్థాలు కడుపు సమస్యను పెంచుతాయి. ఎక్కువ మసాలా దినుసులతో కూడిన పదార్థాలను తినడం మానుకోండి. దీని కారణంగా గ్యాస్, నీరు, అజీర్ణం మొదలైన సమస్యలు ఉండవచ్చు.

Flower Mask: ఓ వ్యాపారి వినూత్న ఆలోచన… బతకాలంటే మూతికి బట్టకట్టాల్సిందే అంటూ పూలతో మాస్కుల తయారీ ఎక్కడంటే

Crime News : చదివింది పదో తరగతే.. కానీ పేస్‌బుక్‌లో పండితుడు.. ఫొటోల మార్ఫింగ్‌తో బ్లాక్‌ మెయిలింగ్..

Village Rancho: చదివింది ఎనిమిదే.. కానీ హెలికాఫ్టర్ తయారు చేశాడు.. చివరకు బ్లేడ్ తగిలి..