Oil free Sabudana Puri: టిఫిన్ గా బెస్ట్ ఎంపిక.. నూనె లేకుండా సగ్గు బియ్యం పూరీలు చేసుకోండి.. టేస్ట్ అదిరిపోతుందంతే
సగ్గుబియ్యంలో అనేక పోషకాలున్నాయి. దీంతో వీటిని తినే ఆహారంలో చేర్చుకోమని నిపుణులు చెబుతారు. అయితే ఎక్కువ మంది సగ్గు బియ్యంతో పాయసం, వడలు, మురుకులు వంటి వాటిని తయారు చేసుకుంటారు. అయితే సగ్గు బియ్యం పూరీ అల్పాహారానికి సరైన ఆరోగ్యకరమైన ఎంపిక. ఎందుకంటే వీటిని నూనె లేకుండా తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేయడం సులభం. నూనె లేకుండా సగ్గు బియ్యం పూరి తయారీ విధానం తెలుసుకోండి..

Oil Free Sabudana Puri
ఆరోగ్యకరమైన, రుచికరమైన టిఫిన్ గా సగ్గు బియ్యం పూరీ సరైన ఎంపిక. పూరీ అంటే నూనె లో వేయించి తయారు చేస్తారని తెలిసిందే. అయితే వీటిని కూడా నూనెలో వేయించవచ్చు. అయితే నూనె లేకుండా కూడా సగ్గుబియ్యం పూరీని తయారు చేసుకోవచ్చు. దీని రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పూరీ ప్రత్యేకత ఏమిటంటే దీన్ని కేవలం 25-30 నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజు ఇంట్లో నూనె లేని సబుదాన పూరిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
తయారీకి కావాల్సిన పదార్థాలు
- సగ్గుబియ్యం : 1 కప్పు
- బంగాళాదుంప: 1 మీడియం సైజు(ఉడికించినది)
- పచ్చిమిర్చి: 1-2 (సన్నగా తరిగినవి)
- ఉప్పు: రుచికి తగ్గట్టుగా
- కొత్తిమీర: 1 టేబుల్ స్పూన్ (తరిగినవి)
- జీలకర్ర పొడి: ½ టీస్పూన్
- సుజీ రవ్వ లేదా గోధుమ పిండి: పిండి చేయడానికి తగినంత
ఇవి కూడా చదవండి
తయారీ విధానం:
- సగ్గుబియ్యం పూరీని ఉదయమే టిఫిన్ గా చేసుకోవాలంటే.. ముందు రోజు రాత్రి సగ్గు బియ్యాన్ని కడిగి నీటిలో నానబెట్టాలి.
- మర్నాడు ఉదయం సగ్గుబియ్యం నీటిని వంపి.. సగ్గుబియ్యం మెత్తగా అయ్యేలా ఉడికించి పక్కన పెట్టుకోండి.
- ర్వాత బంగాళాదుంపలను ఉడకబెట్టాలి. ఒక గిన్నె తీసుకుని అందులో ఉడికించిన బంగాళాదుంపలను వేసి మెత్తగా చేసి.. దానిలో పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.
- ప్పుడు ఈ బంగాళా దుంపల మిశ్రమంలో నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి పిండిని పిసికి బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొంచెం సుజీ రవ్వ లేదా గోధుమ పిండిని వేసి.. పూరీ పిండిని తయారు చేసుకోవాలి.
- ప్పుడు రెడీ అయిన పూరీ పిండిని.. చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి, రోలింగ్ పిన్ ఉపయోగించి గుండ్రని ఆకారంలో పూరీల్లా ఒత్తుకోవాలి.
- తర్వాత నాన్-స్టిక్ పాన్ లేదా ఓవెన్‌లో నూనె లేకుండా రెండు వైపులా లేత బంగారు రంగు వచ్చేవరకు కాల్చండి.
- లా రెడీ అయిన సగ్గుబియ్యం పూరీలను ఇష్టమైన కూరతో అందించండి. .. పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు.
- మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








