AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: గణపతి మండపాలను ఎందుకు బీమా చేస్తారు? పాలసీ వేటిని కవర్ చేస్తుందో తెలుసా..

పెద్ద పెద్ద పండుగలు ప్రమోదాన్ని.. ప్రమాదాన్ని రెండింటినీ తెస్తాయి. ముఖ్యంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో జరుపుకునే పండగలు అయితే మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు సందర్శిస్తూ ఉంటారు. దీంతో మండపానికి వచ్చే భక్తుల భద్రత, విలువైన వస్తువులను నిర్వహించడం..కార్యక్రమం సజావుగా నిర్వహించడం మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకుల బాధ్యత. అందుకనే చాలా మంది తమ మండపాలను భీమా చేస్తున్నారు. ఈ రోజు మండపంలో భీమా కవరేజ్ కింద వచ్చేవి ఏమిటో తెలుసుకుందాం..

Vinayaka Chavithi: గణపతి మండపాలను ఎందుకు బీమా చేస్తారు? పాలసీ వేటిని కవర్ చేస్తుందో తెలుసా..
Vinayaka Chavithi Mandal Insurance
Surya Kala
|

Updated on: Aug 22, 2025 | 3:00 PM

Share

వినాయక చవితి సమీపిస్తున్న కొద్దీ.. దేశ వ్యాప్తంగా మండపాల ఏర్పాటు జోరందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబై, గుజరాత్, డిల్లీ సహా అనేక ప్రాంతాల్లో మండపాలను, గణపతి విగ్రహాలు, అలంకరణలను సిద్ధం చేస్తున్నారు. అయితే ముంబై లో మాత్రం గణపతి చతుర్ధి ఉత్సవాలను జరుపుకోవడానికి ఏర్పాట్లతో పాటు తమ మండపాలకు భారీ బీమా కవరేజీని కూడా చేయిస్తున్నాయి.

ఈ సంవత్సరం కింగ్స్ సర్కిల్‌లోని GSB సేవా మండల్ రికార్డ్ స్థాయిలో రూ. 474.4 కోట్ల బీమా పాలసీని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఇది భారతదేశంలోని ఏ గణేష్ మండపం కూడా ఇప్పటి వరకూ చేయించని అత్యధిక బీమా పాలసీ. ప్రభుత్వ యాజమాన్యంలోని న్యూ ఇండియా అస్యూరెన్స్ అందించే ఈ పాలసీ అలంకరించబడిన వినాయక విగ్రహం. గణపయ్యకి అలంకరించే బంగారు, వెండి ఆభరణాల నుంచి పండుగ సమయంలో సేవ అందించే వందలాది మంది స్వచ్ఛంద సేవకుల వరకు ప్రతిదానికీ వర్తిస్తుంది. అయితే ఈ పాలసీలో కవర్‌లో చేర్చబడినవి మండప సాధారణ భీమా పాలసీ కవర్ చేస్తుంది.

భీమా పాలసీ వేటిని కవర్ చేస్తుందంటే

స్వచ్ఛంద సేవకులు, కార్మికులు – అతిపెద్ద వాటా వంటవారు, పూజారులు, సెక్యూరిటీ గార్డులు, వాలెట్ సిబ్బంది, ఇతరుల రక్షణ కోసం కేటాయించబడింది. మండప నిర్వహణ చేస్తున్న సమయంలో గాయం లేదా మరణం సంభవించినప్పుడు పరిహారం అందిస్తారు.

ఇవి కూడా చదవండి

ఆభరణాలు, వస్తువులు – ఈ సంవత్సరం ఆభరణాల విలువ ₹67 కోట్లు. ఇది 2024లో ₹43 కోట్లుగా ఉంది. దీనికి కారణం బంగారం, వెండి ధరల పెరుగుదల అని తెలుస్తోంది.

ప్రజా బాధ్యత — భారీ సమావేశాలకు సంబంధించిన నష్టాలకు వ్యతిరేకంగా ₹30 కోట్లు.

అగ్ని , ప్రమాద కవరేజ్ – ఫిక్చర్లు, ఫర్నిచర్, పండుగ ప్రాంగణాలకు.

విస్తృత ప్రమాద రక్షణ — అగ్నిప్రమాదం, దొంగతనం, భూకంపం, ప్రమాదాలు, నిమజ్జనం ఊరేగింపుల సమయంలో అత్యవసర పరిస్థితులతో సహా

GSB మండపం బీమా 2023లో ₹360.40 కోట్లు, 2024లో ₹400.58 కోట్లు, ఇప్పుడు 2025లో ₹474.4 కోట్లు ఇలా క్రమంగా పెరుగుతూ వస్తుంది. వేడుకల స్థాయి, బంగారం, వెండి సమర్పణలతో పెరుగుతున్న విలువను ఈ భీమా ప్రతిబింబిస్తుంది.

ఇతర ప్రసిద్ధ మండలాలు కూడా తమను తాము బీమా చేసుకుంటాయి. ఉదాహరణకు ముంబైలో ఎక్కువగా సందర్శించే పండల్ అయిన లాల్‌బాగ్చా రాజా 2024లో ₹32.76 కోట్ల పాలసీని కలిగి ఉంది. ఇది మండపం, ఆస్తి, ఆభరణాలు, కార్మికులు , మూడవ పార్టీ బాధ్యతలను కవర్ చేస్తుంది.

మండపాలు బీమాను ఎందుకు ఎంచుకుంటాయంటే..

విగ్రహాలు, సెట్లు, పండళ్లు , విద్యుత్ అలంకరణతో పాటు విగ్రహాలకు అలంకరించే బంగారు, వెండి ఆభరణాలు, మండపాల నిర్వహణ సమయంలో పనిచేసే స్వచ్ఛంద సేవకులు, పూజారులు, సిబ్బంది కోసం.. ఎటువంటి సందర్భంలోనైనా మండపాల వద్ద ప్రమాదాలు, తొక్కిసలాటలు లేదా ఫుడ్ పాయిజనింగ్ వంటి సంఘటనల సందర్భంలో ప్రజా బాధ్యతగా .. నిమజ్జన ఊరేగింపు సమయంలో ప్రమాదాలు .. వీటి కోసం బీమా సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు.

ఫెస్టివల్ బీమాను ఎక్కువగా ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన న్యూ ఇండియా అస్యూరెన్స్, నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ , యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ అందిస్తాయి. ప్రైవేట్ బీమా సంస్థలు సాధారణంగా వక్రీకృత ప్రమాదం, అధిక ఎక్స్‌పోజర్‌ను పేర్కొంటూ దూరంగా ఉంటాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!