4 / 6
ఏ నూనె మేలు చేస్తుంది - శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తక్కువగా ఉండే నూనెను వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. అలాగే నూనెను తక్కువ పరిమాణంలోనే వినియోగించాలని సూచిస్తున్నారు. బహుళ అసంతృప్త కొవ్వులు, ఒమేగా-3,6 కొవ్వులు కలిగిన నూనెలను వాడటం మంచిది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. దీనితో పాటు శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు అందుతాయి. ఇదిలా ఉంటే ఆలివ్ ఆయిల్ ఎక్కువగా వాడటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఐదు శాతం మేర తగ్గుతుందని ఓ సర్వే చెబుతోంది.