Oats Khichdi: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొడుతుందా..అయితే ఓట్స్ తో వెజ్ కిచిడీ ట్రై చేస్తే సరి

|

Jun 19, 2021 | 2:44 PM

Oats Khichdi: రోజు ఉదయం టిఫిన్ ను మహరాజులా తినాలి. అయితే రోజూ ఒకేరకం టిఫిన్స్ అంటే అబ్బో బోర్.. వద్దు అనేస్తారు ఈజీగా.. కొంతమంది పిల్లలు అయితే టిఫిన్ తినం..

Oats Khichdi: రెగ్యులర్ టిఫిన్స్ తో బోర్ కొడుతుందా..అయితే ఓట్స్ తో వెజ్ కిచిడీ ట్రై చేస్తే సరి
Oats Khichdi
Follow us on

Oats Khichdi: రోజు ఉదయం టిఫిన్ ను మహరాజులా తినాలి. అయితే రోజూ ఒకేరకం టిఫిన్స్ అంటే అబ్బో బోర్.. వద్దు అనేస్తారు ఈజీగా.. కొంతమంది పిల్లలు అయితే టిఫిన్ తినం అంటూ మారాం చేస్తూ.. స్కిప్ చేస్తారు కూడా.. అయితే ఈరోజు ఆరోగ్యాన్ని ఇచ్చే ఓట్స్ తో టేస్టీ టేస్టీ  కిచిడి తయారీ చేయడం ఎలాగో తెలుసుకుందాం

కావలసిన వస్తువులు:

*ఒక టీ గ్లాసులో మూడవ వంతు పెసరపప్పు ఉడకబెట్టి ఉంచుకోవాలి.
* కప్పులో 3/4 వంతు ప్లైన్ ఓట్సు.
* సన్నగా తరిగిన ఒక క్యారెట్
* బీన్స్ చిన్న ముక్కలు
* మూడు పచ్చి మిర్చి
*చిన్న ఉల్లిపాయ ముక్కలు
* ఒక టమోటా ముక్కలు
* గ్రాముల బఠానీలు
* కొత్తిమీర, కరివేపాకు. తగినంత.
* ఉప్పు. రుచికి సరిపడా
* వంటనూనే. తగినంత
*మిరియాలపొడి.స్పూను.
* సాంబారు పొడి. అర టీ స్పూను.
*కారం అర టీ స్పూను.
*పసుపు తగినంత.
*పోపు దినుసులు తగినన్ని.

ఇప్పుడు తయారు చేసే విధానం:

ముందుగా క్యారెట్, బీన్స్, బఠాణీ, మిర్చి , టమాటా ను ఉడికించి పెట్టుకోవాలి తర్వాత స్టౌ మీద బాండలి పెట్టి, రెండు స్ఫూన్ల నునె వేసి, కాస్త కాగాక పోపు దినుసులు వేయాలి. దోరగా వేగిన తరవాత, తరిగిన, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన పెసరపప్పు. అలాగే బీన్సు, క్యారెట్ ముక్కలు, + బఠానీలను ఉడబెట్టినవి వేసి తగినన్ని నీరు పోయాలి అలా కాస్త మరగనిచ్చిన తరువాత కొంచెం కారం, పసుపు వేయాలి తరువాత ప్లైన్ ఓట్స్ వేసి గరిటతో కలడబెడుతూ నీరు పోయాలి జారుడుగా రావాలంటే కాస్త నీరు ఎక్కువ పోయాలి అలా ఓట్స్ బాగా ఉడికేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఓట్స్ ఉడికిన తర్వాత దింపేసేసమయంలో సాంబారు పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి,స్టౌ మీదనుండి దించుకున్న తర్వాత కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు వేడి వేడిగా ఓట్స్ కిచిడీ రెడీ. వేడి వేడిగా తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

Also Read: నేపాల్ లో వరదల భీభత్సం కొండచరియలు విరిగిపడి 16మంది మృతి, 22 మంది గల్లంతు