నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..

గోధుమ పిండిని నెల రోజులు తినకపోవడం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉండవచ్చు. గోధుమ పిండికి బదులుగా మల్టీగ్రెయిన్, బార్లీ, రాగి పిండి వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవచ్చు. మీ ఆహారంలో మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

నెల రోజులు గోధుమ పిండి రొట్టెలు తినకపోతే ఏమవుతుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు..
Wheat Health
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 02, 2024 | 9:52 PM

మన ఆరోగ్యం ఎలా ఉంటుందో మన రోజువారీ జీవనశైలి, ఆహారపు అలవాట్లు నిర్ణయిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే.. చాలా మంది ఆహారం విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటుంటారు.. అయితే, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా గోధుమ పిండిని విరివిగా వినియోగిస్తారు. గోధుమ బ్రెడ్, రొట్టెలు మన ఆహారంలో ముఖ్యమైనవి.. గోధుమ పిండితో ఇంకా అనేక రకాల వంటలను తయారుచేస్తారు. పరోటా.. పూరి, అలాగే పలు రకాల స్వీట్లు తయారు చేస్తుంటారు.. అందుకే.. చాలా మంది గోధుమ పిండితో ఇష్టమైన వంటలను తయారు చేసుకుని తింటారు.. వాస్తవానికి మైదా కంటే.. గోధుమ పిండి మంచిదే.. నార్త్ లో చాలా మంది రొట్టెలను తింటారు..

అయితే, ఎక్కువ కాలం గోధుమ పిండితో చేసిన వంటలను తినడం ఆరోగ్యానికి మంచిది కాదని.. ఇది అనేక సమస్యలను కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. నెల రోజుల పాటు గోధుమ పిండి తినకపోతే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఎప్పుడైనా ఆలోచించారా?.. ఇలా చేస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది.. ఎలా మారి పోతుందో తెలుసుకోండి..

గోధుమ పిండిని తినకపోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గుతుంది: గోధుమ పిండిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు పెరగడానికి సహాయపడుతుంది. మీరు ఒక నెల గోధుమ పిండిని తినకపోతే, మీ బరువు తగ్గవచ్చు.. కానీ మీరు మీ ఆహారం నుంచి గోధుమ పిండిని పూర్తిగా తొలగించాలని దీని అర్థం కాదు. తరచుగా ప్రజలు గోధుమలకు దూరంగా ఉంటారు.. దీని లక్ష్యం త్వరగా పొట్ట – నడుము కొవ్వును తగ్గించడం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గోధుమ పిండి రొట్టెలను ఎక్కువగా తినే వ్యక్తులు మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్‌తో సహా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. నిజానికి, అన్నం కంటే గోధుమలతో తయారు చేసిన పదార్థాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అందుకే మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు గోధుమ పిండికి చాలా కాలం దూరంగా ఉంటే.. మీ జీర్ణక్రియ ఖచ్చితంగా మెరుగుపడుతుంది. మీరు రోటీలకు బదులుగా గోధుమ గంజిని తినవచ్చు.. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు.

నెల రోజుల పాటు గోధుమ పిండిని తినకపోవడం మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశాలూ లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ కలిగి ఉంటుంది. అయితే, మీ ఆరోగ్యానికి ఎన్ని రోటీలు సరైనవన్న విషయాలను మీరు డైటీషియన్ సహాయంతో నిర్ణయించుకోవాలి.

గోధుమలకు ప్రత్యామ్నాయం ఏమిటి..?

మీరు గోధుమ పిండి రోటీలు తినకూడదనుకుంటే.. మీరు దీని కోసం మల్టీగ్రెయిన్ పిండిని ఉపయోగించవచ్చు.. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు బార్లీ, మిల్లెట్, రాగి పిండి రోటీలను ఇంట్లో చేసుకుని తినవచ్చు.. ఇవి ఆరోగ్యానికి కూడా మంచివని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి