AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.. నీచు వాసన రాకుండా.. చికెన్ ముక్క చక్కగా చకచకా ఉడకాలంటే ఇదొక్కటి చేయండి

చికెన్ కర్రీ వండేటప్పుడు ముక్కలు పీచుగా మారడం, నీచు వాసన రావడం చాలామందికి ఎదురయ్యే సమస్య. అయితే ఒక చిన్న చిట్కా పాటిస్తే ప్రెషర్ కుక్కర్ లేకుండానే చికెన్ ముక్కలు మెత్తగా, జ్యూసీగా ఉడుకుతాయి. ఉల్లిపాయ, అల్లం-వెల్లుల్లి, మసాలాలతో చికెన్‌ను ముందుగా తన సహజ రసాల్లోనే ఉడికించి, 3/4 భాగం ఉడికిన తర్వాత మాత్రమే నీరు కలపడం వల్ల ముక్కలు పీచు రాకుండా ఉంటాయి.

అబ్బబ్బ.. నీచు వాసన రాకుండా.. చికెన్ ముక్క చక్కగా చకచకా ఉడకాలంటే ఇదొక్కటి చేయండి
Juicy Chicken Curry
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2026 | 11:42 AM

Share

వీకెండ్ వచ్చిందంటే చాలు.. నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్ ను ఇష్టంగా కొని తెచ్చుకుంటారు. కర్రీ, ఫ్రై ఇంకా చాలా రకాలుగా వండుకుని తింటారు.. అయితే.. చికెన్ కర్రీని వండేటప్పుడు చాలామంది ఎదుర్కొనే సమస్య చికెన్ ముక్కలు పీచుగా మారడం, నీచు వాసన రావడం.. ప్రెషర్ కుక్కర్ లేకుండానే, సాధారణ గిన్నెలో లేదా పాన్ లోనే చికెన్ ముక్కలు పీచు రాకుండా, మెత్తగా, రుచికరంగా ఎలా తయారు చేయాలో ఈ ప్రత్యేకమైన కథనంలో తెలుసుకుందాం.. ఈ పద్ధతి ద్వారా ఇంటివద్దే రెస్టారెంట్ స్టైల్ చికెన్ కర్రీని నీచు వాసన రాకుండా సులభంగా పొందవచ్చు.

ముందుగా, స్టవ్ వెలిగించి మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ముందుగా నూనె వేసి వేడి అయ్యాక రెండు బిర్యానీ ఆకులు వేసి వేయించాలి. ఇది చికెన్ కర్రీకి మంచి సువాసనను ఇస్తుంది. తరువాత, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు బాగా వేయించాలి. కావాలనుకుంటే ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేగిన తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.

తరువాత, పసుపు, కావాలనుకుంటే.. టమాటో ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చల్లి టమాటాలు మెత్తబడే వరకు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడిన తరువాత, శుభ్రం చేసిన చికెన్‌ను వేసి, తాలింపుతో బాగా కలపాలి. తగినంత కల్లు ఉప్పు, కారం వేసి బాగా కలిపి, మూత పెట్టి 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి. ఈ దశలో చికెన్ నుండి సహజంగానే నీరు విడుదల అవుతుంది.

10 నిమిషాల తరువాత, ధనియాల పొడి, ఇంట్లో తయారుచేసిన గరం మసాలా (ఇది ఘాటుగా ఉంటుంది కాబట్టి తగ్గించి వాడాలి), అలాగే కొబ్బరి – పుచ్చపప్పు (ఒక స్పూన్ నానబెట్టిన పుచ్చపప్పు) పేస్ట్‌ను వేయాలి. ఆ తర్వాత కారం, ఉప్పు చూసుకుని.. కావాలంటే వేసుకోవచ్చు. చివరగా, ఒక కప్పు నీటిని పోసి (ఎక్కువ గ్రేవీ కావాలంటే మరో కప్పు నీరు కలుపుకోవచ్చు), మూత పెట్టి మరో 10 నిమిషాల పాటు తక్కువ మంటపై ఉడికించాలి.

ఈ వంట ప్రక్రియలో చికెన్ 3/4 వంతు ఉడికిన తర్వాత నీరు కలపడం అనేది ముక్కలు పీచు రాకుండా, మెత్తగా మారడానికి కీలకమైన చిట్కా. ఇది కర్రీకి రుచితో పాటు సరైన మెత్తదనాన్ని అందిస్తుంది. పది నిమిషాల తరువాత, నూనె పైకి తేలిందని నిర్ధారించుకొని, చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా తయారుచేసిన చికెన్ కర్రీ ప్రెషర్ కుక్కర్లో వండిన దానికంటే రుచిగా, ముక్కలు మెత్తగా, పీచు లేకుండా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ టేస్టీ చికెన్ కర్రీని వండుకుని రుచిచూడండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us