Matka Pizza: ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. మట్కా పిజ్జా.. తింటే వావ్ అనాల్సిందే..

|

Feb 27, 2022 | 5:45 PM

Matka Pizza: పిజ్జా ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఒక ఆహారపదార్ధం. ఆధునిక వంటగదిలో పిజ్జా(Pizza) వంటి వంటకం సర్వసాధారణంగా మారిపోయింది. నిజానికి ఇటలీ(Italy)లో పుట్టిన..

Matka Pizza: ముంబైలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్.. మట్కా పిజ్జా.. తింటే వావ్ అనాల్సిందే..
Matka Pizza
Follow us on

Matka Pizza: పిజ్జా ఇప్పుడు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినే ఒక ఆహారపదార్ధం. ఆధునిక వంటగదిలో పిజ్జా(Pizza) వంటి వంటకం సర్వసాధారణంగా మారిపోయింది. నిజానికి ఇటలీ(Italy)లో పుట్టిన ఒక ఇటాలియన్ వంటకం. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. దేశ దేశాల్లో పిజ్జా అభిమానులు ఉన్నారు.. అంతేకాక, దాని తయారీ చరిత్ర శతాబ్దాల నాటిది. ఈ పిజ్జా శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. కొత్త రుచులను పొందింది. అయితే ఎవరికైనా పిజ్జా అనగానే ముందుగా కళ్ళ ముందు కనిపించేంది.. గుండ్రంగా దట్టంగా ఉండే కేక్ వంటి పదార్థంపై.. దట్టంగా టమాట, క్యాప్సికమ్‌, ఆలివ్స్‌, చీజ్‌, స్పైసెస్‌ వంటి పదార్ధాలతో టాపింగ్ చేస్తారు. ఈ పిజ్జా వెజ్, నాన్ వెజ్ ఉన్నాయి. ఇక వెజ్ పిజ్జాలో అయితే చాలా రకాలున్నాయి.

అందుకనే ఎవరికైనా పిజ్జా అనగానే గుండ్రంగా దట్టంగా టమాట, క్యాప్సికమ్‌, ఆలివ్స్‌, చీజ్‌, స్పైసెస్‌ టాపింగ్‌ చేసినవే గుర్తుకొస్తాయి. అయితే కుండలో తయారుచేసే పిజ్జాను ఎప్పుడైనా చూశారా? మన దగ్గర మట్కా చాయ్‌ ఎంత ఫేమస్సో..  ముంబైలో మట్కా పిజ్జా అంతకంటే పాపులర్‌. రోడ్డు పక్కన తోపుడు బండ్లనుంచి ఫైవ్‌ స్టార్‌ హోటళ్ల వరకూ.. దీన్ని ఒక్కోచోట ఒక్కోలా చేస్తారు. కొంతమంది బొగ్గులపై కుండను పెట్టి వేయించిన పిజ్జా బేస్‌ పైన పనీర్‌, కూరగాయల ముక్కలు, చీజ్‌ వేసి పైనుంచి ఆలివ్స్‌, డబుల్‌ చీజ్‌ లేయర్‌ వేసి స్మోక్డ్‌ ఫ్లేవర్‌తో తయారు చేస్తారు. మరికొందరు కాస్త ఆధునికతను జోడించి పాశ్చాత్య సంప్రదాయం ప్రకారం ఒవెన్‌లో చేస్తూ పిజ్జా ప్రియులను ఆకట్టుకుంటున్నారు. ఈ కుండ పిజ్జాను నోరంతా తెరిచి తినక్కర్లేదు. ఎంచక్కా చెంచాతోనే లాగించేయొచ్చట.. వీలైతే మీరూ ఓసారి ట్రైచేయండి.

 

Also Read:

సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్న నీటి బ్రాహ్మీ ఆరోగ్య ఉపయోగాలు ఎన్నో..