AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. 10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..

సమ్మర్ స్పెషల్.. కమ్మని మామిడికాయ రోటి పచ్చడి.. పుల్లపుల్లగా.. అద్భుతమైన రుచితో కూడిన ఈ రెసిపీ ఎప్పుడూ స్పెషలే.. పుల్లపుల్లని మామిడికాయలతో, సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ఈ పచ్చడి వేడి అన్నంలోకి అద్భుతంగా ఉంటుంది. సులభమైన ఈ తయారీ విధానాన్ని అనుసరించి, ఇంట్లోనే ఈ రుచికరమైన పచ్చడిని ఆస్వాదించండి. ఇది అన్నం, చపాతీ, అల్పాహారంతో ఉత్తమంగా రుచిగా ఉంటుంది.

నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్.. 10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
Raw Mango Chutney
Shaik Madar Saheb
|

Updated on: Apr 23, 2026 | 3:33 PM

Share

మామిడికాయ సీజన్ రాగానే చాలా మందికి నోరూరించే పచ్చడి మామిడికాయ రోటి పచ్చడి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో నెయ్యితో కలుపుకుని తింటే దాని రుచి అద్భుతం.. అయితే.. ఈ పచ్చడిని ఎలా తయారు చేయాలో చాలా మందికి తెలియదు.. కానీ.. మామిడికాయ రోటి పచ్చడి జస్ట్ 10 నిమిషాల్లోనే పూర్తవుతుంది.. దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.. ఈ సంప్రదాయ పచ్చడిని సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. ఇది కేవలం రెసిపీ మాత్రమే కాదు, ఇది ఒక ఎమోషన్ అని చెప్పొచ్చు.. ఎందుకంటే చాలామందికి మామిడికాయ పచ్చడి ఎన్నో తీపి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది.

మామిడికాయ రోటి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు:

మామిడికాయలు: 2 (పచ్చివి)

స్పూన్ చొప్పున మెంతులు, జీలకర్ర, ఆవాలు, రుచికి సరిపడా కల్లుప్పు లేదా సాధారణ ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, పసుపు, కారం సరిపడా, నూనె, ఎండుమిరపకాయలు.. తాలింపు గింజలు కరివేపాకు ఇవి ఉంటే సరిపోతుంది.. దాదాపు అన్ని అందిరి వంటిళ్లలోనూ ఉంటాయి..

తయారీ విధానం:

మొదటగా, రెండు పచ్చి మామిడికాయలను కడిగి తొక్క తీయకుండానే ముక్కలుగా కట్ చేసుకోవాలి. వద్దనుకుంటే.. తొక్క తీసి కూడా వాడుకోవచ్చు.. ఇవి రఫ్‌గా కట్ చేసినా సరిపోతుంది ఎందుకంటే వాటిని దంచాల్సి ఉంటుంది. ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, పావు టీస్పూన్ మెంతులు వేసి దోరగా వేయించాలి. అవి రంగు మారగానే, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ఆవాలు చేర్చి నెమ్మదైన మంటపై వేయించి, ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఇప్పుడు, రోలు (లేదా మిక్సీ జార్) తీసుకొని, వేయించిన మెంతులు, జీలకర్ర, ఆవాలు, రుచికి తగినంత కల్లుప్పు వేసి మెత్తని పొడిలా దంచుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత, రోట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను కొద్దికొద్దిగా వేసుకుంటూ దంచాలి. మామిడికాయ ముక్కలు కొంచెం నలిగిన తరువాత, రెండు టేబుల్ స్పూన్ల కారం, పావు టీస్పూన్ పసుపు చేర్చి, మిగిలిన మామిడికాయ ముక్కలను కూడా వేసుకుంటూ, అక్కడక్కడ చిన్న చిన్న పలుకులు కనబడేలా దంచుకోవాలి.

చివరిగా, పచ్చడికి పోపు సిద్ధం చేయాలి. ఒక కడాయిలో మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, అర టీస్పూన్ పచ్చి శనగపప్పు, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ ఆవాలు వేసి వేయించాలి. అవి కాస్త వేగిన తరువాత, నాలుగైదు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. ఆ తరువాత, పావు టీస్పూన్ ఇంగువ, నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపును బాగా వేయించాలి.

ఈ వేయించిన పోపును దంచుకున్న మామిడికాయ పచ్చడి ముద్దలో వేసి బాగా కలపాలి. ముందుగా తయారుచేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా చేర్చి, అంతా కలిసేలా మరొకసారి కలుపుకోవాలి. రుచి చూసి ఉప్పు సరిపోకపోతే, మరికొంత చేర్చి బాగా కలపాలి. ఇలా తయారుచేసిన మామిడికాయ రోటి పచ్చడి బయట నాలుగైదు రోజుల వరకు, ఫ్రిజ్‌లో వారం పది రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఆ రోజే తినేట్లయితే, ఉల్లిపాయ ముక్కలు దంచి కలుపుకోవచ్చు. ఈ పచ్చడి అన్నంతో పాటు చపాతీ, అల్పాహారంలో కూడా రుచిగా ఉంటుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
10 నిమిషాల్లోనే మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా ట్రై చేయండి..
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
నారింజ పండ్లు తింటే ఫ్యాటీ లివర్‌ను నయం చేయవచ్చా?
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
వేలిముద్రల సీక్రెట్స్.. 99శాతం మందికి ఈ విషయాలు అస్సలు తెలియదు..
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
సారీ సార్ మీ నమ్మకం నిలబెట్టలేకపోయాను.. పంత్ ఆవేదన
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
వాస్తు చిట్కాలు: ఇంటి పేర్లు ఇలా పెట్టండి.. సంతోషం, ఐశ్వర్యం ..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
హీరోకు ఫేక్ మీసాలు.. దెబ్బకు 220 కోట్ల సినిమా అట్టర్ ప్లాప్..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఈ కాంబినేషన్‌ మీకూ ఇష్టమా..? అయితే ఈ విషయం మీకు చెప్పాల్సిందే..
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఆడవాళ్ళు.. కొత్త చీరలకు అదేపనిగా గంజి పెడుతున్నారా?
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
ఏసీ కొనాలనుకుంటున్నారా?3 స్టార్, 5 స్టార్ మధ్య తేడా తెలియకపోతే
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?
తమిళనాడులో జరిగిన రియల్ క్రైమ్ స్టోరీ.. OTTలో ఈ సినిమాను చూశారా?