Uggani: రొటీన్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా రాయలసీమ ఉగ్గానిని ఇంట్లోనే తయారు చేసుకోండి.. రెసిపీ మీకోసం

|

May 15, 2024 | 6:35 PM

డిఫరెంట్ టెస్టి టిఫిన్లను అందిస్తే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. కనుక ఇతర ప్రాంతలో దొరికే టిఫిన్స్ ను ట్రై చేయాలనీ కొందరు కోరుకుంటారు. అలాంటి రుచికరమైన టిఫిన్స్ లో ఒకటి ఉగ్గాని. రాయలసీమ స్పెషల్ అల్పాహారం. కొన్ని చోట్ల బొరుగులు అని అంటారు. గోదావరి జిల్లా ప్రాంత వాసులు మరమరాలు అని పిలుస్తారు. మరమరాలతో తయారు చేసే ఉప్మా అంటే ఉగ్గాని ఎక్కువగా హోటల్స్ లో ఉంటుంది. పిల్లలలు, పెద్దలు ఇష్టంగా తినే ఉగ్గాని, లేదా మరమాల ఉప్మా తయారీ ఈ రోజు తెలుసుకుందాం..

Uggani: రొటీన్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా రాయలసీమ ఉగ్గానిని ఇంట్లోనే తయారు చేసుకోండి.. రెసిపీ మీకోసం
Uggani Or Maramarala Upma
Follow us on

ఉదయం టిఫిన్ అంటే ఏమి తయారు చెయ్యలా అని కొంతమంది తల్లులు ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇడ్లి, దోశ, పూరి ఏది చేసినా అబ్బా రోజూ ఇదేనా అంటూ తినడానికి ఆసక్తిని చూపించారు. టిఫిన్ తినిపించడం అంటే ఒక యుద్ధమే అవుతుంది అమ్మలకు. అటువంటి సమయంలో డిఫరెంట్ టెస్టి టిఫిన్లను అందిస్తే ఇష్టంగా తినేస్తారు. కనుక ఇతర ప్రాంతలో దొరికే టిఫిన్స్ ను ట్రై చేయాలనీ కోరుకుంటారు. అలాంటి రుచికరమైన టిఫిన్స్ లో ఒకటి ఉగ్గాని. రాయలసీమ స్పెషల్ అల్పాహారం. కొన్ని చోట్ల బొరుగులు అని అంటారు. గోదావరి జిల్లా ప్రాంత వాసులు మరమరాలు అని పిలుస్తారు. మరమరాలతో తయారు చేసే ఉప్మా అంటే ఉగ్గాని ఎక్కువగా హోటల్స్ లో ఉంటుంది. పిల్లలలు, పెద్దలు ఇష్టంగా తినే ఉగ్గాని, లేదా మరమాల ఉప్మా తయారీ ఈ రోజు తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

  1. మ‌ర‌మ‌రాలు (బొరుగులు)- అరకేజీ
  2. వేరు శనగ గుల్లు – ఐదు టేబుల్ స్పూన్లు
  3. శనగపప్పు – మూడు టేబుల్ స్పూన్లు
  4. పుట్నాలు పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు
  5. ఇవి కూడా చదవండి
  6. మినపప్పు – రెండు టేబుల్ స్పూన్లు
  7. ఆవాలు – అర టీ స్పూన్
  8. ‘జీలకర్ర – అర టీ స్పూన్
  9. కొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు
  10. పచ్చి మిర్చి
  11. ఉల్లి పాయ
  12. కరివేపాకు
  13. కొత్తిమీర
  14. టమాటా
  15. పసుపు – కొంచెం
  16. ఉప్పు – రుచికి సరిపడా
  17. నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్

ఉగ్గాని త‌యారీ విధానం: మందుగా మరమరాలను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పోసుకోవాలి. గ్యాస్ స్టవ్ మీద బాణలి పెట్టి నూనె పోసి వేడి చెయ్యాలి. ఇందులో కట్ చేసిన పచ్చిమిర్చి, పల్లీలను వేయించి కొంచెం వేగాగానే మినపప్పు, పుట్నాలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి పసుపు వేసి వేయించాలి. ఇంతలో మరమారాల్లో నీటిని పోసి ఆ నీటిని వంపేయాలి. ఇప్పుడు ఉడికిన మసాలాలో నీరు లేకుండా మరమరాలను వేసి వేయించాలి. తర్వాత పుట్నాల పొడి, నిమ్మరసం జోడించి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి ఉగ్గాని రెడీ. రాయలసీమ వాసులు ఈ ఉగ్గానిని ఉల్లిపాయ పచ్చడితో కలిపి తింటారు. అలా తిన్నా సరే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..