Taro Root Benefits: మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చేమదుంపలు చేసే మేలు తెలిస్తే..

|

Apr 09, 2021 | 5:56 PM

Taro Root Benefits:దుంప కూరల్లో ఒకటి చేమదుంప.. దీనిని బంగాళా దుంప తిన్నంత ఇష్టంగా చేమదుంపల్ని తినరు. ముఖ్యంగా చేపదుంపలు జిగురుగా ఉంటాయని తినడానికి ఆసక్తి చూపించరు..

Taro Root Benefits: మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు చేమదుంపలు చేసే మేలు తెలిస్తే..
Chema Dumpalu
Follow us on

Taro Root Benefits:దుంప కూరల్లో ఒకటి చేమదుంప.. దీనిని బంగాళా దుంప తిన్నంత ఇష్టంగా చేమదుంపల్ని తినరు. ముఖ్యంగా చేపదుంపలు జిగురుగా ఉంటాయని తినడానికి ఆసక్తి చూపించరు. అయితే ఈ చేమదుంపలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో మీకు తెలుసా..!

చేమదుంపల్ని తింటే బరువు తగ్గుతారు. చేమ దుంపల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది గుండెకు మేలు చేస్తుంది. వీటిల్లో ఉండే పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనుల్లో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. వీటిల్లో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది. అంతేకాదు చేమదుంపల్లో విటమిన్‌ బి-6 , ‘ఇ’ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. చేమదుంపల్లో ఉండే ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్‌ క్యాన్సర్‌, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.ముఖ్యంగా మైనోపాజ్ దశలో ఉన్న మహిళలకు ఈ చేమ దుంపల వలన ఏంతో మేలు కలుగుతుంది. చేమ దుంపలు తినడం వలన మహిళలోని ఎండోక్రైన్‌ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. గర్భిణీలకు నీరు పట్టడం, వికారంగా ఉండే లక్షణాలను చామదుంపలు తగ్గిస్తాయి.

చేమ దుంపలను తినడం వల్ల రాత్రివేళ చెమట, గొంతు తడి ఆరటం, హాట్‌ ప్లషెస్‌ వంటి లక్షణాలు చేమదుంపల వల్ల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. హార్మోన్‌ రిప్లేస్‌ మెంట్‌ థెరపీకి చేమ దుంపలు ప్రత్యామ్నాయని అంటున్నారు. ఋతుసంబంధిత క్రాంప్స్‌, ఆర్థరైటిస్‌ నొప్పులు, కండరాల అలసట తగ్గించడానికి సహకరిస్తాయి.
అయితే కూరలు ఎక్కువగా వేపించి తినడం కంటే.. కూరలుగా ఉడికించుకుని తింటేనే పోషకాలు ఉంటాయి. అయితే చేమ దుంపలను ఉడికించి తర్వాత వేయించి తింటే చాలా రుచిగా ఉంటాయి. అయితే ఎక్కువ మంది చేమదుంపలను మాంసానికి బదులు తింటారు.. ఇన్ని ఆరోగ్యప్రయోనాలున్న చేమ దుంపల్ని ఇక నుంచి మీరు తినే ఆహారం లో ఒకభాగంగా చేసుకోండి.. మంచి ఆరోగ్య ఫలితాలను పొందండి.

Also Read: గుప్త నిధులు దొరికితే.. ఆ నిధి ఎవరికి చెందుతుంది… ఎలా పంచుతారంటే..!