AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూరగాయే కదా అని చీప్‌గా చూడకండి.. బ్రహ్మాస్త్రం.. పచ్చిగా తిన్నారంటే కొవ్వును కోసి బయటకు తీస్తుంది

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. కొలెస్ట్రాల్ అనేది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది.

కూరగాయే కదా అని చీప్‌గా చూడకండి.. బ్రహ్మాస్త్రం.. పచ్చిగా తిన్నారంటే కొవ్వును కోసి బయటకు తీస్తుంది
Cholesterol
Shaik Madar Saheb
|

Updated on: Mar 03, 2025 | 7:25 PM

Share

ప్రస్తుత కాలంలో కొలెస్ట్రాల్ పెను ప్రమాదకరంగా మారుతోంది.. మనుషుల ఆరోగ్యాన్ని దెబ్బతీసి ప్రమాదకర జబ్బుల బారిన పడేలా చేస్తోంది.. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్.. కొలెస్ట్రాల్ అనేది రక్త సిరల్లో ఫలకం పేరుకుపోవడానికి కారణమవుతుంది.. ఇది రక్తం సరఫరాకు అడ్డంకిని కలిగిస్తుంది. రక్త ప్రవాహం నెమ్మదించడంతో గుండె పంప్ చేయడానికి ఎక్కువ ఒత్తిడి అవసరం.. దీనివల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు కారణమవుతుంది. వాస్తవానికి కొలెస్ట్రాల్ రెండు రకాలు.. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అంటే మంచి కొలెస్ట్రాల్.. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) అంటే చెడు కొలెస్ట్రాల్ గా పరిగణిస్తారు.. అయితే.. ఆరోగ్యకరమైన గుండె కోసం, కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుకోవాలి. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి ఆహారంలో ఏ కూరగాయలను చేర్చుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఈ రోజుల్లో, అనారోగ్యకరమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణంగా, చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సలాడ్‌లో పచ్చి ఉల్లిపాయను జోడిస్తే.. మంచి ఫలితం ఉటుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..

ఉల్లిపాయలో ఎన్నో ప్రయోజనాలు..

ఉల్లిపాయలో క్వెర్సెటిన్ ఉంటుంది.. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థను బలపరిచే ఫ్లేవనాయిడ్ యాంటీఆక్సిడెంట్లు పచ్చి ఉల్లిపాయలో కనిపిస్తాయి. ఉల్లిపాయ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించడానికి, మీ ఆహారం నుంచి నూనె పదార్థాలను కూడా తొలగించండి.

తినడానికి సరైన సమయం..

మీరు ఉల్లిపాయను తప్పుగా తీసుకుంటే.. అది మీకు ప్రయోజనం కలిగించదు.. దీనికి బదులుగా హాని కలిగిస్తుంది.. ఉల్లిపాయల ప్రయోజనాలను పొందడానికి, దానిని పచ్చిగా తినాలి. దీనిని సలాడ్ లాగా తినవచ్చు. మీ రోజువారీ ఆహారంలో ఒక ఉల్లిపాయను తప్పకుండా తీసుకోండి. మీరు భోజన సమయంలో ఉల్లిపాయ తినవచ్చు. మధ్యాహ్న భోజనంలో ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరం. ఇది కాకుండా మీరు రాత్రి భోజనంలో కూడా ఉల్లిపాయను తినవచ్చు..

జంక్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి..

కొలెస్ట్రాల్ రోగి జంక్ ఫుడ్ తినకూడదు. జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య పెరుగుతుంది. మీరు కొలెస్ట్రాల్‌ను నియంత్రించాలనుకుంటే, మీ ఆహారం నుంచి జంక్ ఫుడ్‌లను తొలగించండి. గుండె కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. జీవనశైలిని మార్చుకోండి.. వ్యాయామం చేయండి.. ఇలాంటి దినచర్యతో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
200 ఏళ్లనాటి రాజమహల్‌.. 52 గదులు, 53 తలపుల వెనుక రహస్యం తెలిస్తే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
భలే టేస్ట్.. మాములుగా ఉండదు... మ్యాడైపోతారు..
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?
ఈ జిల్లాలో వారం రోజుల పాటు బంగారం షాప్‌లు క్లోజ్.. ఎందుకంటే?