Crab Fry Recipe: పీతలు అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..

మాంసాహార ప్రియులలో సీఫుడ్ లవర్స్ వెరీ వెరీ స్పెషల్. రొయ్యలు, చేపలు, పీతలు వంటి వాటితో చేసే ఆహారాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసులకు సీఫుడ్ అంటే మరీ ఇష్టం. ఏ సీజన్ లో దొరికే వాటితో ఆ సీజన్ లో పులసల పులుసు, చందువా, సొర చేప వంటి వాటితో పాటు పీతలతో కూడా రకరకాల వంటలు చేసుకుని ఆహా ఏమి రుచి అంటూ లోట్టలేసుకుంటూ తింటారు. పీతలతో చేసే కూరలు అంటే గోదావరి జిల్లా స్పెషల్ వంటకం అని చెప్పవచ్చు. ఈ రోజు పీతలతో రుచికరమైన వేపుడు తయారీ గురించి తెలుసుకుందాం..

Crab Fry Recipe: పీతలు అంటే ఇష్టమా.. రెస్టారెంట్ స్టైల్‌లో వేపుడిని ఇలా చేసుకోండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు..
Crab Fry

Updated on: Apr 22, 2025 | 10:42 AM

విటమిన్ బి2 నీటిలో కరిగేది కనుక మన శరీరం దానిని తక్కువ మొత్తంలో మాత్రమే నిల్వ చేయగలదు. కనుక ఈ విటమిన్ ఉన్న ఆహారాన్ని తరచుగా తినాలి. ఈ బీ2 విటమిన్ తో పాటు ఒమేగా-3 యాసిడ్‌లు పుష్కలంగా పీతల్లో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చాలామంది పీతల కూర అంటే చాలు లొట్టలు వేసుకుంటూ తింటారు. నాన్ వెజ్ ఇష్టపడేవారిలో పీతలను ఎంతో ఇష్టంగా తినేవారు వుంటారు. ఆరోగ్యం ఇచ్చే పీతలతో కోనసీమ స్టైల్ లో వేపుడు తయారీ విధానం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు:

పీతలు – 5(మీడియం సైజ్)

టమాటాలు – 2

ఇవి కూడా చదవండి

ఉల్లిపాయలు – 2

అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్

ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర పొడి – ఒక టేబుల్ స్పూన్

గరం మసాలా – ఒక టేబుల్ స్పూన్

పసుపు – చిటికెడు

కారం – ఒకటిన్నర స్పూన్లు

ఉప్పు- రుచికి సరిపడా

నూనె – 4 టేబుల్ స్పూన్లు

జీలకర్ర – ఒక టీ స్పూన్

పచ్చిమిర్చి -4

కరివేపాకు – కొంచెం

కొత్తిమీర – కొంచెం

తయారీ విధానం: ముందుగా పీతలను శుభ్రం చేసుకోవాలి. కాళ్ళు తీసి పక్కు పెట్టుకోవాలి. రెక్కలు తీసుకుని వాటి పళ్ళను కట్ చేసి నీటిలో ఉప్పు వేసి పీతలను శుభ్రం చేసుకుని ఒక గిన్నెలో పీతలను వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నూనె పోసి వేడి ఎక్కిన తర్వాత జీలకర్ర వేసి.. నిలువగా కట్ చేసిన పచ్చి మిర్చి ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. వేయించిన తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి వేయించి తర్వాత టమాటా ప్యూరీ వేసి వేయించి.. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించి పసుపు, కారం వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పౌడర్ .. రుచికి సరిపడా ఉప్పు వేయి.. ఈ మసాలా మిశ్రమాన్ని దోరగా వేయించండి. తర్వాత శుభ్రం చేసుకున్న పీతలు వేసి మూత పెట్టి ఉడికించండి. పీతల్లో నీరు బయటకు వచ్చి.. పీతలు ఉడుకుతాయి. అలా మొత్తం పీతలు ఉడికి మిశ్రమం నుంచి నూనె బయటకు వచ్చేటంత వరకూ వేయించండి. చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే టేస్టీ టేస్టీ పీతల వేపుడు రెడీ. ఇది పప్పు చారు, చారు వంటి వాటితో తింటే ఆహ ఏమి రుచి అనాల్సిందే ఎవరైనా..

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..