Egg vs Banana: కోడి గుడ్డుకు అరటిపండు ప్రత్యామ్నాయమా? నిపుణుల కమిటీ ఏం తేల్చిందంటే..

|

Jul 20, 2022 | 6:25 PM

Karnataka: కర్ణాటకలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నభోజనంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా గుడ్లకు బదులు అరటి పండ్లు లేదా ఇతర పోషకాహార పదార్థాలతో భర్తీ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్యానెల్ ఇచ్చిన సూచనలపై రాజకీయ దుమారం రేగుతోంది.

Egg vs Banana: కోడి గుడ్డుకు అరటిపండు ప్రత్యామ్నాయమా? నిపుణుల కమిటీ ఏం తేల్చిందంటే..
Karnataka Mid Day Meals
Follow us on

Karnataka: కర్ణాటకలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నభోజనంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ముఖ్యంగా గుడ్లకు బదులు అరటి పండ్లు లేదా ఇతర పోషకాహార పదార్థాలతో భర్తీ చేయాలని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP) ప్యానెల్ ఇచ్చిన సూచనలపై రాజకీయ దుమారం రేగుతోంది. ఇదిలా ఉండే మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు ఏది పెట్టాలన్న నిర్ణయం తీసుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసింది. కర్ణాటక స్టేట్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయత్ రాజ్ యూనివర్శిటీ (Gadag) నిర్వహించిన ఈ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. పాఠశాల మధ్యాహ్న భోజనంలో భాగంగా అరటిపండ్లు తినే పిల్లలు బరువు బాగా పెరిగారని, ఇవి గుడ్లకు ప్రత్యామ్నాయం కాదని సూచించింది. ఈక్రమంలో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లకు బదులు అరటి పండ్లను అందించే విషయంలో పునరాలోచించాలని ఈ కమిటీ సూచించింది.

‘అరటి పండ్లలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే శరీరానికి సుమారు 110kcal/100g శక్తినందిస్తుంది. ఇక పోటాషియం సమృద్ధిగా ఉన్న ఆహార పదార్థాలలో అరటి ఒకటి. 100 గ్రాముల అరటిపండ్లలో సుమారు 358 మిల్లీగ్రాముల పొటాషియం లభ్యమవుతుంది. అయితే ఈ పండులో ఎటువంటి ప్రోటీన్లు ఉండవు. అయితే పొటాషియం, క్యాలరీలు, ఖనిజాలు మాత్రం సమృద్ధిగా ఉంటాయి. అరటిపండును తినే పిల్లల్లో బీఎంఐ ఇండెక్స్‌ కూడా బాగా పెరుగుతుంది’ అని ఈ కమిటీ సూచించింది. ఈక్రమంలోనే అరటి పండ్లు గుడ్లకు సరైన ప్రత్యా్మ్నాయం కాదని, వీటికి బదులు వేరుశనగ, పాల ఉత్పత్తులు లేదా చిక్కుడు గింజలు ఇస్తే బాగుంటుంది’ అని పేర్కొంది.

చిక్కీస్‌ రూపంలో..
ఇదే విషయంపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మాజీ చైర్‌పర్సన్ NEP ఇంప్లిమెంటేషన్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వై మరిస్వామిమాట్లాడుతూ’ గుడ్లకు బదులు పిల్లలకు వేరుశనగలతో చేసిన చిక్కీస్‌ ఇస్తే బాగుంటుంది’ అని సూచించారు. అదేవివధంగాప్రజారోగ్య వైద్యురాలు, పరిశోధకురాలు డాక్టర్ సిల్వియా కర్పగం మాట్లాడుతూ, ‘ పాల ఉత్పత్తుల్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ విరివిగా లభ్యమవుతాయి. అందుకే గుడ్లకు బదులు ఒక గ్లాసు పాలు/పెరుగు లేదా పనీర్ అందించాలని, అవసరమైతే అదనంగా అరటి పండ్లు ఇవ్వాలి’ అని కోరారు. ‘కొద్దిగా ప్యాక్ చేసిన ప్రొటీన్‌కు గుడ్డు చాలా దగ్గరగా ఉంటుంది. దీనిని పిల్లలు తినవచ్చు. ఇక సాంబార్‌లోని పప్పు, పప్పుధాన్యాల్లోని ప్రోటీన్ కంటెంట్ పరంగా పిల్లలకు మేలైనవి’ అని వన్ బిలియన్ లిటరేట్స్ ఫౌండేషన్ పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ డాక్టర్ రూపా దేవసదన్ సూచించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..