AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ ఉన్నవాళ్లు పెరుగు తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..

షుగర్ ఉంటే పెరుగు తినకూడదని ఎవరైనా అన్నారా? అయితే వారు పొరబడినట్లే.. మధుమేహ రోగులకు పెరుగు కేవలం ఒక ఆహార పదార్థం మాత్రమే కాదు.. అది ప్రకృతి ప్రసాదించిన ఔషధం. అయితే దీనిని ఎలా తినాలో, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలియకపోతే మాత్రం ముప్పు తప్పదు. పెరుగులోని ఆ మంచి బ్యాక్టీరియా మీ షుగర్ లెవెల్స్‌ని ఎలా తగ్గిస్తుందో తెలుసుకుందాం..

షుగర్ ఉన్నవాళ్లు పెరుగు తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
Is Curd Good For Diabetes
Krishna S
|

Updated on: May 08, 2026 | 2:03 PM

Share

మండుటెండలో చల్లటి పెరుగుతో భోజనం ముగించడం భారతీయులకు ఒక సంప్రదాయం. కానీ మధుమేహం అనే మాయదారి రోగం మన దేశంలో ఒక నిశబ్ద మహమ్మారిలా విస్తరిస్తున్న వేళ, మనం తినే ప్రతి ముద్దపై అనుమానం కలగడం సహజం. ముఖ్యంగా పెరుగు విషయంలో.. దీనివల్ల షుగర్ పెరుగుతుందా?, మజ్జిగ తాగొచ్చా?, మార్కెట్లో దొరికే పెరుగు మంచిదేనా?” వంటి ప్రశ్నలు ప్రతి మధుమేహ రోగి మదిలో మెదులుతుంటాయి. ఈ గందరగోళానికి చెక్ పెడుతూ, ఆరోగ్య నిపుణులు కీలక విషయాలు వెల్లడించారు.

పెరుగు మధుమేహానికి ఎలా ఔషధమవుతుంది..?

నిపుణుల పరిశోధనల ప్రకారం.. సహజసిద్ధమైన పెరుగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఒక అద్భుతమైన ఆహారం. పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్ వంటి మంచి బ్యాక్టీరియా మన జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. కడుపులో మంటను తగ్గించి, జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మన శరీరంలో జీర్ణక్రియ ఎంత మెరుగ్గా ఉంటే, ఇన్సులిన్ సెన్సిటివిటీ అంత బాగుంటుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. పెరుగు యొక్క గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. అంటే ఇది తిన్న వెంటనే రక్తంలో చక్కెరను ఒక్కసారిగా పెంచదు. నెమ్మదిగా శక్తిని విడుదల చేయడం వల్ల డయాబెటిస్ రోగులకు ఇది సురక్షితం.

ఫ్లేవర్డ్ యోగర్ట్

మనం సూపర్ మార్కెట్లలో చూసే అందమైన కప్పుల్లో లభించే స్ట్రాబెర్రీ, మ్యాంగో లేదా వెనిలా ఫ్లేవర్డ్ యోగర్ట్‌లు మధుమేహ రోగులకు నిజమైన శత్రువులు. ఈ పెరుగులో ఆ పండు తక్కువ, చక్కెర, రసాయనాలు ఎక్కువ ఉంటాయి. ఇవి చూడటానికి ఆరోగ్యకరంగా అనిపించినా, ఒక్క కప్పు తింటేనే రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఎప్పుడూ ఇంట్లో తోడుపెట్టిన స్వచ్ఛమైన ఆవు పాలు లేదా వెన్న తీసిన గేదె పాల పెరుగునే వాడాలి.

బరువును అదుపులో ఉంచే అస్త్రం

మధుమేహం ఉన్నవారు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య అధిక బరువు. బరువు పెరిగే కొద్దీ షుగర్ లెవెల్స్ పెరగడం గ్యారెంటీ. పెరుగులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. దీనివల్ల మాటిమాటికీ చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. బరువును అదుపులో ఉంచడం ద్వారా మధుమేహాన్ని నియంత్రించవచ్చు.

పెరుగును ఎలా తీసుకుంటే మంచిది

చాలా మంది పెరుగులో పంచదార లేదా బూందీ వేసుకుని తింటారు. ఇది మధుమేహ రోగులకు ఏమాత్రం మంచిది కాదు.

మిరియాలు, జీలకర్ర: పెరుగులో చిటికెడు మిరియాల పొడి లేదా వేయించిన జీలకర్ర పొడి కలుపుకోవడం వల్ల రుచితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది.

కూరగాయల రాయితా: పెరుగులో ఉల్లిపాయలు, కీర దోసకాయ లేదా టమోటా ముక్కలు కలిపి రైతా లాగా తీసుకోవడం వల్ల ఫైబర్ అదనంగా అందుతుంది. ఇది షుగర్ నియంత్రణకు మరింత మేలు చేస్తుంది.

సరైన సమయం: రాత్రి పూట కంటే మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవడం శ్రేయస్కరం.

మజ్జిగ – షుగర్ రోగుల సహజ పానీయం

మీకు పెరుగు తినడం భారంగా అనిపిస్తే, దానిని చిలికి మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు. మజ్జిగ మన శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులు కాకుండా మజ్జిగ రక్షణ కవచంలా పనిచేస్తుంది. మధుమేహం ఉన్నంత మాత్రాన మీకు ఇష్టమైన పెరుగును వదులుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పంచదార లేని, ఇంట్లో తయారుచేసిన తాజా పెరుగును సరైన పరిమాణంలో తీసుకుంటే అది మీ ఆరోగ్యానికి వరమవుతుంది.

(గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇందులో పేర్కొన్న ఆహార నియమాలు వివిధ అధ్యయనాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.)

Follow Us
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్..
అమ్మ మరణం.. నాన్న వదిలేశాడు.. అనాథశ్రమంలోనే పెరిగా..
అమ్మ మరణం.. నాన్న వదిలేశాడు.. అనాథశ్రమంలోనే పెరిగా..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇక RTCలో ప్రయాణం మరింత సౌకర్యవంతం
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
దేవాలయాలలో స్త్రీలు అర్చకులుగా ఉండవచ్చా? శాస్త్రం ఏం చెబుతోంది..?
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
ఓవర్సీస్‌లో పెద్ది టార్గెట్ ఎంతో తెలుసా..? భుజాలపై భారీ బాధ్యత
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
కరుప్పుతో కమ్‌బ్యాక్.. ఇప్పుడు సూర్యకు అసలైన పరీక్ష మొదలు
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
వాషింగ్ మెషీన్‌లో ఒకేసారి ఎన్ని బట్టలు వేయాలి? ఓవర్‌ లోడ్‌ అయితే?
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
టాలీవుడ్‌పైపు చూస్తున్న బాలీవుడ్ భామలు.. 2026లో హైదరాబాద్‌కే మకాం
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
కావేరి కాలింగ్ ఉద్యమం ద్వారా మెరుగైన ఫలితాలు
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి
హైదరాబాద్‌ నుంచి 36 మందితో బయల్దేరిన బస్సు.. సరిగ్గా అక్కడికి