
ఆదివారం వస్తే చాలు ఇంట్లో కోడి ఉడకాల్సిందే అయితే, అందరూ బ్రాయిలర్ కోళ్లను మాత్రమే ఎక్కువగా తింటారు. నాటు కోడి జోలికి పోరు. ఎందుకంటే, ఇది ధర ఎక్కువగా ఉంటుంది కాబట్టి, దీనిని తినడానికి ఇష్ట పడరు. కానీ, నాటు కోడి టేస్ట్ మాములు కోళ్లలో ఎక్కడా దొరకదు. ఎందుకంటే దాని క్రేజ్ అలా ఉంటుంది మరి.

కావాల్సిన పదార్థాలు : నాటు కోడి 500 గ్రాములు, 5 టేబుల్ స్పూన్లు నూనె , పావు టీ స్పూన్ పసుపు, ఉప్పు , కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టీ స్పూన్ ధనియాలు పూడి, దాల్చిన చెక్క 2 చిన్నవి, లవంగాలు 3, యాలకులు 2, జీలకర్ర అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మంట ఎక్కుగా ఉన్న పచ్చిమిర్చి 4, ఉల్లిపాయ 1, అర కట్ట కొత్తిమీర.

తయారీ విధానం: మొదటగా స్టవ్ మీద పాన్ పెట్టి అది వేడయ్యాక దానిలో కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసి బాగా ఉడికించాలి. ఇలా చేయడం వలన దానిలో ఉన్న పచ్చి దనం పోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి దానిలో 5 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక ముందుగా పక్కకు పెట్టుకున్న నాడు కోడి ముక్కలు వేసి మగ్గనివ్వాలి.

ఆ తర్వాత పాన్ తీసుకుని ధనియాలు, యాలకులు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు వేయించుకోవాలి. దీనిని కిందకి దింపి మిక్సీ లో పట్టుకుని పొడి లాగా చేసుకోవాలి. ఇక అదే సమయంలో నాలుగు పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిని కూడా పట్టుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి.

ఇప్పుడు నాటుకోడి ముక్కలు దానిలో ఈ పేస్ట్ ను వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అయితే, బ్రాయిలర్ చికెన్ కన్నా ఇది ఉడకటానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి, గరిటెతో దీనిని కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి వేసి తిప్పి , ఆ తర్వాత కొత్తిమీర వేసి రెండు నిముషాలు ఉంచి దించాలి. అంతే అదిరిపోయే నాటుకోడి ఫ్రై రెడీ