Sabudana Dosa: సగ్గు బియ్యం దోశ.. నోట్లో కరిగిపోతాయ్..

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. దోశలను ఎలా వేసినా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పటివరకూ మనం దోశల్లో చాలా రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ కోసమే మరో కొత్త రెసిపీ తీసుకొచ్చాం. అవే సగ్గు బియ్యం దోశలు. సగ్గు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సగ్గు బియ్యం తినడం వల్ల శరీరానికి చలువ. వీటిల్లో ఫైబర్ కూడా అధికంగా..

Sabudana Dosa: సగ్గు బియ్యం దోశ.. నోట్లో కరిగిపోతాయ్..
Sabudana Dosa
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jul 24, 2024 | 9:47 PM

దోశలు అంటే చాలా మందికి ఇష్టం. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. దోశలను ఎలా వేసినా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పటివరకూ మనం దోశల్లో చాలా రెసిపీలు తెలుసుకున్నాం. ఇప్పుడు మీ కోసమే మరో కొత్త రెసిపీ తీసుకొచ్చాం. అవే సగ్గు బియ్యం దోశలు. సగ్గు బియ్యం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. సగ్గు బియ్యం తినడం వల్ల శరీరానికి చలువ. వీటిల్లో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థకు ఎంతో మంచిది. ఇన్ని పోషకాలున్న సగ్గుబియ్యంతో దోశలు తయారు చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. సగ్గుబియ్యం దోశలు తయారు చేయడానికి ఎలాంటి పదార్థాలు కావాలి? వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

సగ్గుబియ్యం దోశలకు కావాల్సిన పదార్థాలు:

సగ్గు బియ్యం, శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొత్తి మీర, ఆయిల్.

ఇవి కూడా చదవండి

సగ్గుబియ్యం దోశల తయారీ విధానం:

ముందుగా సగ్గు బియ్యాన్ని శుభ్రంగా రెండు సార్లు కడిగేసి.. మంచి నీరు వేసి ఓ రెండు గంటల ముందే నానబెట్టి పక్కన పెట్టు కోవాలి. ఆ తర్వాత నీళ్లు వంపేయకుండానే.. ఇందులో శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. దోశ బ్యాటర్ కాస్త మందంగా ఉండాలి. మరీ పల్చగా ఉంటే దోశలు రావు. ఆ తర్వాత ఇందులో పచ్చి మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర కలిపి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశల్ని టమాటా చట్నీ, కొబ్బరి చట్నీతో తింటే రుచి బావుంటాయి. కావాలంటే మీరు పెరుగు, కొద్దిగా బేకింగ్ సోడా వేసి కలిపి అయినా దోశలు వేసుకోవచ్చు. ఇలా అయినా రుచి బాగుంటుంది.