ఈ నీరు పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే ఆ సమస్యలన్నీ పరార్.. ఏంటో తెలుసుకోండి..

దాల్చినచెక్క.. భారతీయ వంటశాలలలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.. ఇది ఆయుర్వేద ఔషధాలలో ఒకటి. అందుకే.. దాల్చిన చెక్కను ఆరోగ్యానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆహారానికి సువాసనతోపాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.. అయితే.. దాల్చిన చెక్క నీటిని

ఈ నీరు పవర్‌ఫుల్.. ఉదయాన్నే పరగడుపున తాగితే ఆ సమస్యలన్నీ పరార్.. ఏంటో తెలుసుకోండి..
Cinnamon Water
Follow us

|

Updated on: Jul 24, 2024 | 9:43 PM

దాల్చినచెక్క.. భారతీయ వంటశాలలలో ఉండే సుగంధ ద్రవ్యాలలో ఒకటి.. ఇది ఆయుర్వేద ఔషధాలలో ఒకటి. అందుకే.. దాల్చిన చెక్కను ఆరోగ్యానికి దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఆహారానికి సువాసనతోపాటు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.. అయితే.. దాల్చిన చెక్క నీటిని రోజూ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్క నీటిని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోండి..

కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నందున దాల్చిన చెక్క నీటిని రోజువారీ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

  1. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. కడుపు ఉబ్బరాన్ని నియంత్రిస్తుంది. గ్యాస్, అజీర్తిని నివారిస్తుంది.
  2. శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి, బరువు తగ్గాలనుకునే వారికి దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల చాలా మేలు జరుగుతుంది.. ఈ నీరు ఆకలిని తగ్గించడానికి, కొవ్వును వదిలించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.
  3. రోజూ ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగడం వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. అంతే కాదు, మెదడు సంబంధిత అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
  4. దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
  5. దాల్చినచెక్క నీరు శరీరంలో మంటను తగ్గించడం ద్వారా చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  6. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లోని చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎలా తాగాలి..

దాల్చిన చెక్క నీరు.. అల్పాహారానికి ముందు ఖాళీ కడుపుతో చాలా ఆరోగ్యానికి మంచిది.. అలాకాకుంటే పడుకునే ముందు తాగిన మంచిదే.. అయితే.. దాల్చిన చెక్క నీటిలో ఒక టీస్పూన్ తేనె లేదా నిమ్మరసం కలిపి తాగడం వల్ల శరీరానికి మరిన్ని ప్రయోజనాలు అందుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..