21 July 2024
TV9 Telugu
Pic credit - pexels
చాలా మంది బరువు తగ్గడానికి చియా విత్తనాలపై ఆధారపడతారు. చియా గింజలు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన కొవ్వును తగ్గించడంలో బాగా సహాయపడతాయి.
అయితే చియా సీడ్స్ తినడం అందరి ఆరోగ్యానికి మంచిది కాదు. చియా విత్తనాలు ఎవరికి హానికరమో తెలుసుకోండి.
నువ్వులు, ఆవాలు అలర్జీ ఉన్నవారు చియా గింజలను తినకూడదు. ఈ గింజలో ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది చాలా మందికి చర్మం దురద , వాపు వంటి అలెర్జీ సమస్యలను కలిగిస్తుంది.
అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా చియా విత్తనాలను తినకూడదు. హై బీపీ సమస్యకు మందు వేసుకునేటప్పుడు చియా సీడ్స్ తినకపోవడమే మంచిది.
చియా గింజల్లో ఉన్న ఒమేగా 3 రక్తాన్ని పల్చగా మారుస్తుంది. కనుక రక్త స్రావ సమస్యలు ఉన్నవారుయాంటీ ప్లేట్‌లెట్ మందులు తీసుకునేవారు కూడా చియా విత్తనాలకు దూరంగా ఉండాలి.
చాలామంది కడుపు సంబధిత సమస్యలతో బాధపడుతున్నారు. అధిక ఆమ్లత్వం ఉన్నవారు చియా విత్తనాలకు దూరంగా ఉండడం మేలు.
రక్తంలో చక్కెరను నియంత్రించడానికి చాలా మంది ప్రతిరోజూ మందులు తీసుకుంటారు. ఈ ఔషధాన్ని తీసుకునేటప్పుడు చియా విత్తనాలను తీసుకోకూడదు.
గర్భిణీ స్త్రీలు చియా సీడ్స్ తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.