ఏదైనా పండుగ వచ్చిందంటే చాలు.. ఇంట్లో ప్రత్యేకంగా పిండివంటలు ఉండాల్సిందే. పూరీలు, వడలు, గారెలు ఇలా ఒకటేంటి ఎన్నో వెరైటీలు.
పిల్లలు ఇష్టంగా తింటారని.. అప్పుడప్పుడూ వడలు,పూరీలు, గారెలను బ్రేక్‌ఫాస్ట్, స్నాక్స్‌గా చేస్తుంటారు కొందరు.
అయితే పూరీ, వడ, గారెలు లాంటివి చేసేటప్పుడు ఎక్కువగా ఆయిల్ అవసరమవుతుంది. మరి ఈ వంటకాలకు నూనె ఎక్కువగా పీల్చకుండా ఉండాలంటే..
మీరు ఇంట్లో గారెలు చేయాలనుకున్నప్పుడు సహజంగానే వడలు మొత్తగా ఉండాలని పిండిని మెత్తగా రుబ్బుకుంటారు. కానీ, దీని వల్ల నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి.
గట్టిగా రుబ్బితే గారెలు గట్టిగా వస్తాయి. అలా కాకుండా పిండిని నార్మల్‌గా మీడియం రేంజ్‌లో రుబ్బుకోవాలి. అలాగే, ఇక వడలు చేసేప్పుడు నూనె బాగా వేడేక్కిన తర్వాతే గారెలు వేసి కాల్చుకోవాలి.
తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి నూనెని ఎక్కువగా పీల్చుకుంటాయి. మంటను ఎప్పుడు తక్కువ ఫ్లేమ్‌లో పెట్టుకోవటం కూడా చెయొద్దు. ఎక్కువ మంటపెట్టి వడల్ని వేయించుకోవాలి.
అయితే, నూనెని మరీ ఎక్కువగా వేడి చేయొద్దు. మీడియం కంటే వేడిగా ఉండాలి. మరీ ఎక్కువ వేడి అయితే గారెలు పై పైన మాడిపోతాయి. లోపల పచ్చిగానే ఉంటాయి.
అలాగే, గారెలు కరకరలాడుతూ ఉండాలంటే గారెల పిండిలో కొంచెం సేమ్యా కలపాలి. దాంతో పాటు గారెల పిండి మిక్సీ చేసిన 5 నిమిషాల లోపే గారెలను వేసుకుంటే నూనె పీల్చవు.
గారెలు, వడలు, నూనెలో ఫ్రై చేసిన ఏ పదార్థాలనైనా అలానే తినకూడదు. వాటిని కాల్చుకున్న తర్వాత టిష్యూ, బటర్ పేపర్, కిచెన్ టవల్‌లో వేయాలి.
అప్పుడే అందులోని నూనె తగ్గుతుంది. దీంతో ఎక్సెస్ ఆయిల్ ఆ పేపర్స్ పీల్చుకుంటాయి.