Mushroom Noodles: మష్రూమ్ నూడుల్స్ ఇలా చేస్తే.. ఆవురుమని తింటారు..

|

Jul 29, 2024 | 7:41 PM

రోడ్లపై అమ్మే చిరు తిండ్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటారు. ఫాస్ట్ ఫుడ్ అనగానే చాలా మందికి నూడుల్స్ గుర్తుకు వస్తాయి. నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. నూడుల్స్‌తో పాటు వాళ్లు ఇష్టమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా యాడ్ చేసుకుని తింటూ ఉంటారు. ఇలా రుచిగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో బయట తినడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంతో కొంత..

Mushroom Noodles: మష్రూమ్ నూడుల్స్ ఇలా చేస్తే.. ఆవురుమని తింటారు..
Mushroom Noodles
Follow us on

రోడ్లపై అమ్మే చిరు తిండ్లు తింటూ ఉంటారు. ముఖ్యంగా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటారు. ఫాస్ట్ ఫుడ్ అనగానే చాలా మందికి నూడుల్స్ గుర్తుకు వస్తాయి. నూడుల్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. నూడుల్స్‌తో పాటు వాళ్లు ఇష్టమైన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటెమ్స్ కూడా యాడ్ చేసుకుని తింటూ ఉంటారు. ఇలా రుచిగా ఉంటుంది. అయితే ఈ రోజుల్లో బయట తినడం కంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని ఎంతో కొంత తినడం ఉత్తమం. నూడుల్స్‌లో పుట్టగొడుగులు వేసుకుని తింటే మరింత రుచిగా ఉంటుంది. వీటిని కూడా ఎంతో ఫాస్ట్‌గా తయారు చేసుకోవచ్చు. ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. మరి ఈ మష్రూమ్ నూడుల్స్ ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మష్రూమ్ నూడుల్స్‌కి కావాల్సిన పదార్థాలు:

మష్రూమ్, నూడుల్స్, తరగిని వెల్లుల్లి, పచ్చి మిర్చి, అల్లం ముక్కలు, బ్లాక్ పెప్పర్, స్ప్రింగ్ ఆనియన్, కొత్తిమీర, సోయా సాస్, నువ్వులు, వెనిగర్, ఉప్పు, ఆయిల్ లేదా బటర్

మష్రూమ్ నూడుల్స్‌ తయారీ విధానం:

ముందుగా నూడుల్స్‌లో కొద్దిగా ఆయిల్, ఉప్పు వేసి ఉడకబెట్టి స్టెయిన్ చేసుకోవాలి. ఆ తర్వాత కడాయి పెట్టి అందులో ఆయిల్ లేదా బటర్ వేసి సన్నగా తరిగిన వెల్లుల్లి, అల్లం ముక్కలు వేసి బాగా వేయించాలి. ఇవి వేగాక పచ్చి మిర్చి, ఉల్లికాడుల వేసి మరింత వేయించాలి. ఇవి కూడా వేగిపోయాక మష్రూమ్స్ శుభ్రంగా కడిగి వేయాలి. వీటిని చిన్న మంటపై బాగా వేయిచాలి.

ఇవి కూడా చదవండి

మష్రూమ్స్‌లో ఉండే వాటర్ అంతా బయటకు పోయేంత వరకు వేయించాక.. మిరియాలు, సోయాసాస్ వేసి కలపాలి. ఇప్పుడు నూడుల్స్, కొద్దిగా వెనిగర్, రుచికి సరిపడగా ఉప్పు వేసి మిక్స్ చేయాలి. తర్వాత వీటిని హై ఫ్లేమ్‌లో బాగా ఫ్రై చేయాలి. చివరగా గార్నిష్ కోసం ఉల్లి కాడలు, కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే మష్రూమ్ నూడుల్స్ సిద్ధం. కావాలి అనుకునేవారు క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ వేసుకోవచ్చు.