Gun Powder: గన్ పౌడర్ ఇలా చేస్తే.. ఇడ్లీ, దోశెల్లోకి సూపర్‌గా ఉంటుంది!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 10:30 PM

సాధారణంగా తెలుగువారు ఎక్కువగా దోశె, ఇడ్లీలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తెలుగు వారికి బాగా అలవాటై పోయిన బ్రేక్ ఫాస్ట్. అయితే వీటిల్లోకి ఎప్పుడూ రకరకాల చట్నీలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చట్నీలే కాకుండా.. ఒక్కోసారి పొడులు అందులో నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ సారి గన్ పౌడర్ చేసి పెట్టుకోండి. ఎలా లేదన్నా రెండు, మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉన్నది తినకపోయినా..

Gun Powder: గన్ పౌడర్ ఇలా చేస్తే.. ఇడ్లీ, దోశెల్లోకి సూపర్‌గా ఉంటుంది!
Gun Powder
Follow us on

సాధారణంగా తెలుగువారు ఎక్కువగా దోశె, ఇడ్లీలు ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవి తెలుగు వారికి బాగా అలవాటై పోయిన బ్రేక్ ఫాస్ట్. అయితే వీటిల్లోకి ఎప్పుడూ రకరకాల చట్నీలు తయారు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ చట్నీలే కాకుండా.. ఒక్కోసారి పొడులు అందులో నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటాయి. ఈ సారి గన్ పౌడర్ చేసి పెట్టుకోండి. ఎలా లేదన్నా రెండు, మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉన్నది తినకపోయినా.. వారానికి సరిపడా ఒక్కసారి కూడా తయారు చేసుకోవచ్చు. ఈ గన్ పౌడర్ బ్రేక్ ఫాస్టుల్లో చాలా రుచిగా ఉంటుంది. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్. మరి ఈ గన్ పౌడర్ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

గన్ పౌడర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:

కరివేపాకు, బియ్యం, మిరియాలు, శనగ పప్పు, మినపప్పు, ఎండు మిర్చి, కొబ్బరి పొడి, ఉప్పు, నువ్వులు, ఆయిల్, ఎండు మర్చి.

గన్ పౌడర్ రెసిపీ తయారీ విధానం:

గన్ పౌడర్ తయారు చేసుకోవడానికి ముందుగా.. స్టవ్ మీద కడాయి పెట్టాలి. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వెడెక్కాక ఎండు మర్చి వేసి కాస్త వేగాక.. ఇందులోనే మినపప్పు, శనగపప్పు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత బియ్యం, నువ్వులుకూడా వేసి మరోసారి ఫ్రై చేసుకోవాలి. నెక్ట్స్ కరివేపాకు, ఎండు కొబ్బరి పొడి, మిరియాలు వేసి మరికాసేపు వేయించాలి. ఈ దినుసులన్నీ వేయించిన తర్వాత.. ఓ ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటన్నింటినీ.. మిక్సీ జార్‌లో వేసి, కాస్త ఉప్పు కూడా వేసి పొడిలా తయారు చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

అంతే ఎంతో రుచిగా ఉండే గన్ పౌడర్ సిద్ధం. ఈ పౌడర్, ఇడ్లీ, దోశెలు, ఉప్మా, మరమరాల పులిహార, పోహాలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఆహా అంటారు. ఇలా పొడిలా తినలేని వారు.. ఇందులో కొద్దిగా వాటర్ వేసి.. కలిపి తినవచ్చు. ఇలా తిన్నా కూడా రుచిగానే ఉంటుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓ సారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది.