Chicken Samosa: చికెన్ కర్రీ మిగిలి పోయిందా.. ఇలా సమోసాలు చేసేద్దామా..

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 11:30 PM

నాన్ వెజ్ తినేవారు అప్పుడప్పుడూ ఇంట్లో చికెన్ కర్రీ వండుతూ ఉంటారు. కూర వండాక ఎంతో కొంత మిగిలి పోవడం అనేది సహజం. అలా చికెన్ కర్రీ మిగిలి పోతే.. ఇలా సాయంత్రం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మిగిలిపోతే.. వాటితో సమోసాలు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. చికెన్ కర్రీ రెడీగానే ఉంది కాబట్టి.. పిండి కలుపుకుంటే చాలు. ఎంతో ఫాస్ట్‌గా సమోసాలు రెడీ అయిపోతాయి. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ చికెన్ సమోసాలు ఎలా తయారు..

Chicken Samosa: చికెన్ కర్రీ మిగిలి పోయిందా.. ఇలా సమోసాలు చేసేద్దామా..
Chicken Samosa
Follow us on

నాన్ వెజ్ తినేవారు అప్పుడప్పుడూ ఇంట్లో చికెన్ కర్రీ వండుతూ ఉంటారు. కూర వండాక ఎంతో కొంత మిగిలి పోవడం అనేది సహజం. అలా చికెన్ కర్రీ మిగిలి పోతే.. ఇలా సాయంత్రం స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. చికెన్ కర్రీ మిగిలిపోతే.. వాటితో సమోసాలు తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. చికెన్ కర్రీ రెడీగానే ఉంది కాబట్టి.. పిండి కలుపుకుంటే చాలు. ఎంతో ఫాస్ట్‌గా సమోసాలు రెడీ అయిపోతాయి. ఇవి ఎంతో రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. మరి ఈ చికెన్ సమోసాలు ఎలా తయారు చేస్తారు? వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

చికెన్ సమోసాలకు కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్, క్యాప్సికం తరుగు, ఉప్పు, మైదా పిండి, ఆయిల్.

చికెన్ సమోసా తయారీ విధానం:

ముందుగా చికెన్ కర్రీలోని బోన్స్ తీసేసి.. మెత్తని ముక్కలను మాత్రమే తీసుకోండి. వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో కొద్దిగా ఆయిల్ వేసి.. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి ఓసారి వేయించు కోవాలి. ఆ తర్వాత క్యాప్సికం, కొత్తి మీర, ఉప్పు, చికెన్ గ్రేవీ కొద్దిగా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మరో గిన్నె తీసుకుని అందులో మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి.

ఇవి కూడా చదవండి

నెక్ట్స్ స్టవ్ మీద కడాయి పెట్టి.. అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని చపాతీలా ఒత్తుకుని.. సమోసా ఆకారంలో కట్ చేసుకోావలి. సమోసాలా చుట్టుకుని అందులో చికెన్ మిశ్రమం ఉంచి.. క్లోజ్ చేసి.. వేడిగా ఉండే ఆయిల్ లో వేసి రెండు వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే చికెన్ సమోసా సిద్ధం. ఇంకెందుకు లేట్ చికెన్ కర్రీ మిగిలి పోతే ఈసారి ఇలా ట్రే చేయండి.