
ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉండటంతో.. ఆరోగ్యంపై శ్రద్ధ అనేది పెరిగింది. దీంతో ఆరోగ్యంగా ఉండే వంటకాలు తింటున్నారు. వాటిల్లో రాగి ఇడ్లీలు కూడా ఒకటి. ఇవి చాలా పాపులర్. రాగి పిండి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఉదయం ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకున్నవారు ఈ రాగి ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు. ఇవి రుచిగా ఉండటమే కాకుండా.. ఆరోగ్యం కూడా. మరి ఇంకెందుకు లేట్ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రాగి ఇడ్లీలు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.
రాగి పిండి, ఇడ్లీ రవ్వ, ఉప్పు, బేకింగ్ సోడా, మినపప్పు.
ముందుగా ఇడ్లీకి మనం ఎలా అయితే పిండి తయారు చేసుకుంటామో.. అలాగే మినపప్పు ఆరు గంటల పాటు నానబెట్టి పప్పు రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మినపప్పు కడిగి, గ్రైండ్ చేసే సమయంలోనే ఇడ్లీ రవ్వ కూడా ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసిన మినపప్పు పిండిలో.. నీటిలో నానబెట్టిన ఇడ్లీ రవ్వను పిండి.. మినపప్పు పిండి మిశ్రమంలో వేయాలి. ఈ రెండింటినీ బాగా కలిపి.. రాత్రంతా పులియ బెట్టాలి.
ఉదయం తెల్లవారు జామున ఇడ్లీలు వేసే ముందు ఇడ్లీ పిండిలో కొద్దిగా రాగి పిండిని, ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. వీటిల్లో క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, ఉడకబెట్టిన పచ్చి బఠాణీ ఇలా ఏమైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకుని ఇడ్లీల్లా వేసుకోవాలి. ఓ పది నిమిషాలు ఆగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే రాగి ఇడ్లీలు సిద్ధం. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. ఏ చట్నీతో అయినా తినవచ్చు. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఓసారి ట్రై చేయండి.