Masala Dal: ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మసాలా పప్పు చేయండి.. వావ్ అనాల్సిందే!

| Edited By: Ravi Kiran

Aug 03, 2024 | 11:00 PM

 సాధారణంగా పప్పు అనగానే టమాటా పప్పు, ముద్ద పప్పు, పాలకూర పప్పు. ఇవే కాకుండా పప్పులో చాలా రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇదే స్టైల్‌లో మసాలా పప్పు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పును ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ ఇలాగే చేయమని చెప్తారు. అన్నం, పులావ్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, పూరీ, దోశ వంటి వాటతో కూడా ఈ పప్పును తినొచ్చు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి..

Masala Dal: ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా మసాలా పప్పు చేయండి.. వావ్ అనాల్సిందే!
Masala Dal
Follow us on

సాధారణంగా పప్పు అనగానే టమాటా పప్పు, ముద్ద పప్పు, పాలకూర పప్పు. ఇవే కాకుండా పప్పులో చాలా రకాల వెరైటీలు తయారు చేసుకోవచ్చు. ఇదే స్టైల్‌లో మసాలా పప్పు కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పప్పును ఒక్కసారి రుచి చూశారంటే.. మళ్లీ ఇలాగే చేయమని చెప్తారు. అన్నం, పులావ్, రోటీ, చపాతీ ఇలా ఎందులోకైనా ఇది చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, పూరీ, దోశ వంటి వాటతో కూడా ఈ పప్పును తినొచ్చు. అంతే కాకుండా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇది చేయడానికి కూడా ఎంతో సమయం పట్టదు. చాలా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ మసాలా పప్పును ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

మసాలా పప్పుకు కావాల్సిన పదార్థాలు:

కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ లేదా నెయ్యి.

మసాలా పప్పు తయారీ విధానం:

ముందుగా కంది పప్పును ఉడక బెట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. ఇప్పుడు సన్నగా తరిగి ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి రంగు మారేంత వరకూ వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇది వేగాక.. పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఓ రెండు నిమిషాలు వేయించాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఉడకబెట్టిన కంది పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పప్పను నీళ్లలా కాకుండా.. మరీ చిక్కగా కాకుండా కాస్త దగ్గరగా ఉడికించుకోవాలి. చివరిగా కొత్తి మీర వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే మసాలా పప్పు రెడీ. ఇది అందరికీ బాగా నచ్చుతుంది. అలాగే ఎందులోకైనా హ్యాపీగా తినొచ్చు. ఈ మసాలా పప్పు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.