దీర్ఘకాలిక వ్యాధులు వరుస పెట్టి ఎటాక్ చేయడం మొదలు పెట్టడంతో.. చాలా మంది హెల్దీ డైట్‌ని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఇలా ఉదయం పూట హెల్దీ అల్పాహారం తినాలి అనుకున్న వారికి మొక్కజొన్న టమాటా బాత్ బెస్ట్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు, డయాబెటీస్, రక్త పోటు వంటి వాటితో బాధపడేవారు జొన్న రవ్వతో తయారు చేసే టమాటా బాత్‌ని ఎలాంటి డౌట్ లేకుండా తినొచ్చు. ఇది తయారు చేయడం కూడా చాలా సులభం. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. మరి జొన్న రవ్వ టమాటా బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
జొన్న రవ్వ, టమాటాలు, తాళింపు దినుసులు, కరివేపాకు, కొత్తి మీర, అల్లం, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు, పచ్చి బఠాణి, క్యారెట్, ఆయిల్.
ముందుగా జొన్న రవ్వను శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు తాళింపు దినసులు, అల్లం తురుము, కరివేపాకు వేసి బాగా వేయించు కోవాలి. ఆ నెక్ట్స్ పచ్చిమిర్చి, ఉల్లి పాయ ముక్కలు వేసి వేగాక.. బఠాని, క్యారెట్ ముక్కలు కూడా వేసి ఓ నిమిషం పాటు ఫ్రై చేశాక.. టమాటా ముక్కలు, ఉప్పు కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ మగ్గించాలి.
టమాటా ముక్కలు బాగా మగ్గాక.. కొలతకు సరిపడా వాటర్ పోసి కలపాలి. నీళ్లు మరిగాక.. రవ్వ వేసి కలుపుకోవాలి. రవ్వ ఉడుకుతూ.. దగ్గరకి అయ్యేంత వరకూ ఉడికించు కోవాలి. రవ్వ ఉడికిన తర్వాత కొత్తి మీర చల్లుకుని సర్వ్ చేసుకోవడమే. కావాల్సిన వారు ఈ టైమ్‌లో నెయ్యి వేసుకోవచ్చు. హెల్దీ బ్రేక్ ఫాస్ట్ తినాలి అనుకునేవారు ఇలా జొన్న రవ్వతో ఎంతో టేస్టీగా ఉండే టమాటా బాత్ తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది.