Aloo Tikki Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా ‘ఆలూ టిక్కా’ తయారీ మీకోసం..

|

Sep 23, 2021 | 1:09 PM

Aloo Tikki Recipe:  రోజూ ఒకే రకం ఆహారపదార్ధాలను తినాలంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతారు. అప్పుడు డిఫరెంట్ ఫుడ్ కోసం రెస్టారెంట్ల వైపు చూస్తారు. అయితే కరోనా సమయంలో..

Aloo Tikki Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా ఆలూ టిక్కా తయారీ మీకోసం..
Alu Tikka
Follow us on

Aloo Tikki Recipe:  రోజూ ఒకే రకం ఆహారపదార్ధాలను తినాలంటే పిల్లలే కాదు.. పెద్దలు కూడా బోర్ ఫీల్ అవుతారు. అప్పుడు డిఫరెంట్ ఫుడ్ కోసం రెస్టారెంట్ల వైపు చూస్తారు. అయితే కరోనా సమయంలో రెస్టారెంట్లకు వెళ్లాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే రెస్టారెంట్లలో దొరికే ఫుడ్ ఐటెమ్స్ ను కొంచెం సమయం కేటాయించి కొంచెం శ్రమపడితే.. మనమే ఇంట్లో రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో చేసుకునే ఫుడ్ ఆరోగ్యానికి ఆరోగ్యంతో పాటు డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. నచ్చినన్ని తినొచ్చు కూడా.. ఈరోజు పిల్లు పెద్దలు ఇష్టంగా తినే స్నాక్ ఐటెం ఆలు టిక్కా తయారీ విధానం తెలుసుకుందాం..  ఆలూ టిక్కీ అనేది ఉడికించిన బంగాళాదుంపలు, బఠానీలు, కొద్దిగా మసాలా దినుసులతో తయారు చేసిన ఉత్తర భారతీయ వంటకం. ఈ స్నాక్ ఐటెం లో పోషకాలు కూడా మెండు అని ఆహారానిపుణులు చెబుతున్నారు. ఆ పోషకాలు కూడా తెలుసుకుందాం

ఆలూ టిక్కీ తయారీకి కావలసిన పదార్ధాలు: 

బంగాళాదుంపలు-300 గ్రా

మిరియాల పొడి-టీస్పూన్

ధనియాల పొడి-టీస్పూన్

జీలకర్ర పొడి-టీస్పూన్

అల్లం పొడి-టీస్పూన్

చాట్ మసాలా పొడి-టీస్పూన్

మొక్కజొన్న పిండి(కార్న్ ప్లోర్)-5-2 టేబుల్ స్పూన్ల

కొత్తిమీర

 ఉప్పు – రుచికిసరిపడా 

తయారీ విధానం: ముందుగా, బంగాళాదుంపలు బాగా ఉడకబెట్టాలి.  ఆలు చల్లారిన తర్వాత పై తొక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి స్మాష్ చేయాలి. అనంతరం అందులో  పైన చెప్పిన అన్ని పదార్ధాలు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని మధ్యలో ఒత్తాలి. స్టౌ మీద పాన్‌ పెట్టుకుని నూనె వేడి చేసుకోవాలి. అందులో  టిక్కీలను వేసి బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. టిక్కీలలో ఉన్న అదనపు నూనెను తీసివేసేందుకు టిష్యూ పేపర్లో ఉంచితే సరిపోతుంది.  అంతే ఘుమఘుమలాడే ఆలు టిక్కీలు రెడీ.. వీటిని పెరుగు, పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్‌తో వేడిగా తింటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేరు.

ఆరోగ్య ప్రయోజనాలు: 

బంగాళాదుంపలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు, విటమిన్ సి, విటమిన్ బి 6, పొటాషియం వంటివి ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్‌లు క్యాన్సర్, డయాబెటిస్ లక్షణాలు, హృదయ సంబంధ వ్యాధుల వంటి తీవ్రమైన అనారోగ్యాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. ఇక రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. వీటిల్లో ఉండే  పిండి పదార్ధాలు ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది.  బంగాళాదుంపలు జీర్ణక్రియకు మంచివి.  బంగాళాదుంపలు తింటే త్వరగా ఆకలి వేయదు ఇక టిక్కీలో వేసే చాట్ మసాలా అనేక సుగంధ ద్రవ్యాల మిశ్రమం.. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Also Read:  Ginger-Garlic Tea: రోగనిరోధక శక్తిని పెంచే ‘అల్లం వెల్లుల్లి టీ’తో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో..