Healthy Breakfast: బీట్ రూట్ ఇడ్లీలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. బీట్ రూట్‌లో ఎక్కువగా ఐరన్ శాతం ఉంటుంది. ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధ పడేవారు బీట్ రూట్ తినడం మంచిది. అంతే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలా మందికి బీట్ రూట్ అంటే నచ్చదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా బీట్ రూట్ తినని వారి కోసమే ఈ బీట్ రూట్ ఇడ్లీలు. వీటిని ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన..

Healthy Breakfast: బీట్ రూట్ ఇడ్లీలు.. రుచితో పాటు ఆరోగ్యం కూడా..
Healthy Breakfast

Edited By: Ravi Kiran

Updated on: Apr 01, 2024 | 7:05 AM

బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం తెలిసిందే. బీట్ రూట్‌లో ఎక్కువగా ఐరన్ శాతం ఉంటుంది. ఇది తినడం వల్ల రక్త హీనత సమస్య ఉండదు. కాబట్టి రక్త హీనత సమస్యతో బాధ పడేవారు బీట్ రూట్ తినడం మంచిది. అంతే కాకుండా ఇంకా ఎన్నో పోషకాలు ఉన్నాయి. చాలా మందికి బీట్ రూట్ అంటే నచ్చదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా బీట్ రూట్ తినని వారి కోసమే ఈ బీట్ రూట్ ఇడ్లీలు. వీటిని ఎంతో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఎంతో రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడా. పిల్లలకు ఇవి పెట్టడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీ బీట్ రూట్ ఇడ్లీ ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

బీట్ రూట్ ఇడ్లీకి కావాల్సిన పదార్థాలు:

బియ్యం, మినపప్పు, బీట్ రూట్, ఉప్పు.

బీట్ రూట్ ఇడ్లీ తయారీ విధానం:

మినపప్పును, బియ్యాన్ని విడివిడిగా కడిగి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ రెండింటినీ కలిపి మిక్సీలో వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ ఒకే గిన్నెలో వేసి రాత్రంతా పులియ బెట్టాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టకుండ.. బయటనే ఉంచాలి. నెక్ట్స్ డే మార్నింగ్.. బీట్ రూట్ తీసుకుని పైన తొక్కను తీసి.. చిన్న ముక్కలుగా కట్ చేసి.. మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో వేసి బాగా కలపాలి.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి.. కాసేపు పక్కన పెట్టండి. పిండి నుంచి పచ్చి వాసన వస్తుంది అనుకునేవారు.. బీట్ రూట్‌ని ముక్కలుగా కట్ చేసి వాటర్‌లో ఉడక బెట్టి పేస్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఆయిల్‌లో ఫ్రై చేసి మిక్సీ పట్టవచ్చు. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని అందులో ఇడ్లీ మాదిరి వేసి.. ఆవిరి మీద ఉడికిస్తే బీట్ రూట్ ఇడ్లీలు సిద్ధం. ఈ పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు.