Health Tips: ఒక వ్యక్తి రోజుకు ఎన్ని సార్లు తినాలి.. తక్కువ తింటే ఏమవుతుంది..?
ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిసార్లు తినాలి..? కొందరు ఒకసారి తింటే ఇంకొందరు మూడు, నాలుగుసార్లు తింటారు. రోజుకు ఒక్కసారి తింటే బరువు తగ్గుతారా..? మరి చిన్న చిన్న మీల్స్‌గా నాలుగైదు సార్లు తినే పద్ధతి నిజంగానే బెస్టా..? దీనిపై అసలు ఆరోగ్య నిపుణులు ఏమంటున్నార..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

హెల్దీగా ఉండాలంటే మంచి ఫుడ్ తినాలి.. ఇది అందరికీ తెలిసిందే.. ఇక్కడి వరకు బాగానే ఉంది.. అయితే రోజుకు ఎన్నిసార్లు భోజనం చేయాలి అనే విషయంలో మాత్రం చాలామందికి సందేహాలు ఉంటాయి. కొందరు రోజుకు ఒక్కసారి తింటే, మరికొందరు రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు తింటుంటారు. అసలు ఒక వ్యక్తి ఎన్నిసార్లు తింటే ఆరోగ్యకరమో, ఏ పద్ధతి మంచిదో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
సమతుల్య భోజనమే కీలకం
రోజులో మీరు ఎన్నిసార్లు తింటున్నారు అనేది పెద్ద లెక్క కాదు.. మీ శరీరానికి సమతుల్య భోజనం, ఆరోగ్యకరమైన పోషకాలు అందుతున్నాయా లేదా అన్నదే ప్రధానం. మీ శరీరానికి అనుగుణంగా రోజుకు రెండు నుండి మూడుసార్లు భోజనం చేయడం ఉత్తమం.
- ముఖ్యంగా బ్రేక్‌ఫాస్ట్ అస్సలు మిస్ అవ్వద్దు.
- పొట్టను ఆకలితో ఎక్కువసేపు ఉంచకండి..
- మీ ప్లేట్‌లో ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు ఉండేలా చూసుకోండి
రోజుకు ఒకసారి మాత్రమే తింటే వచ్చే సమస్యలు
కొందరు బరువు తగ్గడానికి రోజుకి ఒకేసారి ఫుల్‌గా తింటారు. దీని వల్ల వెయిట్ తగ్గినట్టే అనిపిస్తుంది కానీ ఇది రిస్క్‌తో కూడిన పద్ధతి. శారీరక శ్రమ అధికంగా చేసేవారు లేదా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఇలా ఒక్కసారి మాత్రమే తినడం వలన తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మీరు ఒక్కసారి మాత్రమే తిన్నా, ప్రతి 2-3 గంటలకోసారి కొద్దిగా నట్స్, పండ్లు లేదా క్యారెట్లు తినడం మర్చిపోవద్దు. లేదంటే బాడీలో పోషకాలు తగ్గి ఇబ్బంది పడతారు.
రోజుకు నాలుగైదుసార్లు తినడం మంచిదేనా?
కొందరు రోజుకు నాలుగు లేదా ఐదు సార్లు తింటారు. ప్రతిసారీ తక్కువ పరిమాణంలో తినడం నిజానికి సూపర్ మెథడ్. దీనివల్ల మీ జీవక్రియ స్పీడ్‌గా పనిచేస్తుంది. బాడీకి ఎనర్జీ రెగ్యులర్‌గా అందుతుంది. కానీ ఎక్కువ సార్లు మంచిది కదా అని అని ఎక్కువగా తినేయకండి.. అప్పుడు బరువు ఈజీగా పెరిగిపోతారు. జంక్ ఫుడ్, స్వీట్లు జోలికి వెళ్లకపోవడం చాలా బెటర్. మీ లైఫ్‌స్టైల్‌కి ఏది సెట్ అవుతుందో చూసుకొని, ఆరోగ్యకరమైన ఫుడ్ ఉండేలా ప్లాన్ చేసుకోండి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నాము.)




