
ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం తక్కువ తినడం సరిపోదు, సరైన పోషకాలున్న ఆహారం తీసుకోవాలి. మనం రెగ్యులర్‌గా తినే రైస్ ఇడ్లీకి బదులుగా, పప్పుధాన్యాలతో చేసిన ఈ హై-ప్రోటీన్ ఇడ్లీ తింటే గంటల తరబడి ఆకలి వేయదు. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, జీర్ణక్రియను మెరుగుపరిచే ఈ సరికొత్త ఇడ్లీ రెసిపీ విశేషాలు మీకోసం..
కావలసిన పదార్థాలు:
ఒక కప్పు పప్పుల మిశ్రమం (లెంటిల్స్)
అర కప్పు శనగపప్పు
అర కప్పు కిడ్నీ బీన్స్
అర కప్పు మఖానా
ఒక టీస్పూన్ మెంతి గింజలు
తయారీ పద్ధతి:
పైన పేర్కొన్న పప్పులు, కిడ్నీ బీన్స్ మెంతులను కనీసం 6 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. మఖానాను మాత్రం గ్రైండ్ చేసే అరగంట ముందు నానబెడితే సరిపోతుంది.
నానిన పదార్థాలన్నింటినీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ పిండిని అప్పటికప్పుడే వాడుకోవడం మంచిది లేదా రాత్రంతా పులియబెడితే ఇడ్లీలు మరింత మృదువుగా వస్తాయి.
ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నెయ్యి రాసి, పైన తురిమిన క్యారెట్, కొత్తిమీర లేదా బీట్‌రూట్ వేసి పిండిని పోయాలి. ఆవిరిపై ఉడికిస్తే వేడివేడి ప్రోటీన్ ఇడ్లీలు సిద్ధం!
ఈ ఇడ్లీ తింటే కలిగే ప్రయోజనాలు:
ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు త్వరగా నిండిన అనుభూతి కలుగుతుంది, ఫలితంగా అనవసరమైన ఆకలి కోరికలు తగ్గుతాయి.
కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉండి ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
మెంతులు పప్పుధాన్యాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన విషయాలు కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే, దీనికి సంస్థ ఎటువంటి బాధ్యత వహించదు.