అధిక బీపీ ఉన్నవారు ఈ 5 ఆహారాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే

|

Sep 21, 2021 | 9:09 PM

High Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ -19 సమయంలో రక్తపోటు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అధిక బీపీ ఉన్నవారు ఈ 5 ఆహారాలను అస్సలు తినకూడదు..! ఎందుకంటే
High Blood Pressure
Follow us on

High Blood Pressure: మీకు అధిక రక్తపోటు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ -19 సమయంలో రక్తపోటు ఉన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక మరణాల పెరుగుదలకు దారితీస్తుంది. అధిక రక్తపోటు వల్ల మీ ధమనులు దెబ్బతిని, మీ గుండెకు రక్త ప్రవాహం తగ్గుతుంది. అందువల్ల మీ గుండె తగినంత రక్తాన్ని పంప్ చేయడానికి మరింత కష్టపడాలి. ఇది మీ హృదయాన్ని బలహీనపరుస్తుంది. అందుకే బీపీ పేషెంట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల బీపీ పేషెంట్లు ఈ 5 ఆహారాలను తినకూడదు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. కాఫీ
బీపీ పేషెంట్లు కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. అందుకే BP రోగులు కాఫీ తాగకూడదు.

2. ప్యాక్ చేసిన ఆహారాలు
ప్యాక్ చేసిన ఆహారాలలో సాధారణంగా సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీ పెరిగేలా చేస్తుంది. అందువల్ల, మార్కెట్‌లో ప్యాక్ చేసిన ఆహారాలకు బదులు ఇంట్లో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి.

3. వేరుశెనగ వెన్న
వేరుశెనగ వెన్న కొవ్వును పెంచే ఆహారంగా పిలుస్తారు. అధిక బీపీ రోగులకు బరువు పెరగడం మంచిది కాదు. ఇది కాకుండా ఇందులో సోడియం ఎక్కువగా ఉంటుంది. ఇది BPని పెంచుతుంది. అందువల్ల అధిక బీపీ రోగులు వేరుశెనగ వెన్న తినకూడదు.

4. ఉప్పు
ఉప్పు బీపీ రోగులకు పెద్ద ముప్పు. అధిక బీపీ ఉన్నవారు ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఆహార పదార్థాల పైన కూడా ఉప్పు వేసుకోకూడదు. సముద్రపు ఉప్పుకు బదులుగా రాతి ఉప్పును ఉపయోగించడం మంచిది.

5. ప్రాసెస్ చేసిన మాంసం
ప్రాసెస్ చేసిన మాంసంలో సోడియం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల దీనిని తినకూడదు. ఇది కాకుండా సాస్, ఊరగాయ, జున్ను లేదా బ్రెడ్‌తో మాంసం తినకూడదు. ఎందుకంటే సమస్య ఎక్కువవుతుంది. అధిక బీపీ రోగులు ప్రాసెస్ చేసిన మాంసానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

Big News Big Debate: కేటీఆర్‌ కేంద్రంగా కుట్ర జరుగుతోందా..? టీఆర్‌ఎస్‌ విసిరిన సవాల్‌కు రాహుల్‌ సిద్ధమేనా..?

Mahant Narendra Giri: ఎన్నో అనుమనాలు..మరెన్నో ప్రశ్నలు.. మిస్టరీగా మారిన మహంత్ నరేంద్రగిరి సూసైడ్‌..

Income Tax: ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. భారీగా ట్యాక్స్ ఆదా చేసుకోండి.. అంతే..