Hearty Winter Warmers: శీకాకాలం వచ్చేసింది.. తినే ఆహార పదార్ధాలపట్ల మరింత జాగ్రత్త వహించాల్సి ఉంది. వేడి వేడిగా భోజనం చేయడం అత్యవసరం. అంతేకాదు ఈ చలికాలంలో ఆకలి పెంచడానికి గుడ్డుని తినే ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎప్పుడు గుడ్డిని ఉడక బెట్టి.. లేదా ఆమ్లెట్ గా వేసుకుని తినాలా బోర్ అంటూ పిల్లలే కాదు పెద్దలు కూడా అంటారు. ఈ నేపథ్యంలో ఈరోజు శీతాకాలంలో రోజు తినడానికి గుడ్డతో డిఫరెంట్ ఐటెమ్స్ తయారీ గురించి తెలుసుకుందాం..
ఉడికించిన గుడ్డుతో ఛాట్: ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ.. ముందుగా గుడ్లను ఉడికించి వాటిపై పెంకుని తీసుకోవాలి. అనంతరం ఉడికిన గుడ్లపై కాస్త ఉప్పు, తరిగిన ఉల్లిపాయ, టమాటా, చింతపండు, నిమ్మకాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు వేసి కలిపితే మీ చాట్ రెడీ
ఎగ్ కబాబ్: మీరు కనుక కబాబ్ ని ఇష్టంగా తినేవారు అయితే.. గుడ్డుతో రుచికరంగా కబాబ్ చేసుకోవచ్చు. ముందుగా గుడ్లను ఉడికించి .. పెంకు తీసి.. ఆ ఉడికిన గుడ్డుని శనగపిండిలో ముంచి .. దానిని నూనె లో వేయించాలి. ఇది మంచి స్నాక్ ఐటెం. దీనిని రెడ్ లేదా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
ఎగ్ దోశ: ముందుగా పెనం మీద దోశ పిండిని పరిచి.. దానిమీద కోడి గుడ్డు.. కొట్టి.. దానిని కూడా దోశలా పరచాలి. అనంతరం కొంచెం ఉప్పు, కారం తో పాటు ఇష్టమైన వారు అభిరుచికి తగిన విధంగా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇది చాలా హెల్తీ బ్రేక్ ఫాస్ట్..
ఎగ్ పకోడా: ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, వంకాయలు లేదా మరేదైనా కూరగాయలతో ఎలా పకోడీ చేసుకుంటామో.. అదే విధంగా ఎగ్ తో కూడా చేసుకోవచ్చు. ఈ ఎగ్ పకోడీని అన్ని వయసుల వారు ఇష్టంగా తింటారు.
గుడ్డు పరాఠా: ఈ ఎగ్ పరాఠా మంచి అల్పాహారం, ముఖ్యంగా ఆఫీసుకు వెళ్లేవారికి బెస్ట్ ఛాయిస్. పరాఠాలు ఒక క్లాసిక్ ఇండియన్ ఫుడ్. అయితే పరాఠాలకు ఫిల్లింగ్ గా గుడ్లు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, గరం మసాలాను నింపి మరింత రుచికరంగా తయారు చేస్తారు.
Also Read: ఏపీ సినిమా ఆన్ లైన్ టికెట్ విధానంపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు..