AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: ఈ సూప్‌లు తాగితే ఈజీగా బరువు తగ్గొచ్చు.. అవేంటో తెలుసుకోండి..

Healthy Soups For Weight Loss: ప్రస్తుత కాలంలో చాలామంది అధికబరువుతో బాధపడుతున్నారు. అలాంటి వారు వ్యాయామంతో పాటు, బరువు తగ్గడానికి సరైన డైట్‌ను అనుసరించడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. బరువు తగ్గడానికి ఆహారంలో పలు రకాల సూప్‌లను తీసుకోవడం మంచిది. ఆ సూప్‌లు ఏవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Shaik Madar Saheb
|

Updated on: Feb 21, 2022 | 10:58 AM

Share
పాలకూర సూప్: బరువు తగ్గడానికి పాలకూర, బచ్చలికూర సూప్ తీసుకోవడం చాలా మంచిది. మీరు పాలకూరను సలాడ్ లేదా కూర వండుకొని తినవచ్చు. కానీ దాని సూప్ ఆరోగ్యానికి మరింత మంచిదని పేర్కొంటున్నారు.

1 / 5
క్యారెట్ సూప్: చలికాలంలో సులభంగా లభించే క్యారెట్ సూప్ ఆరోగ్యకరమైనది. శరీరానికి సరైన పోషకాహారాన్ని అందించే క్యారెట్‌లో విటమిన్లు, పోషకాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గడానికి దీన్ని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవడం మంచిది.

2 / 5
గుమ్మడికాయ వెల్లుల్లి సూప్: ఉదరం సమస్యలను దూరం చేసి.. జీర్ణవ్యవస్థను మెరుగుపర్చే గుమ్మడికాయ సూప్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. ఇందులో పసుపు, వెల్లుల్లిని కలపి తీసుకుంటారు. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా ఉన్నాయి. దీంతోపాటు రోగనిరోధక శక్తిని పెరగడంతోపాటు.. బరువు తగ్గొచ్చు.

3 / 5
క్యాబేజీ సూప్: బరువు తగ్గే సమయంలో పచ్చి కూరగాయలను ఎక్కువగా తీసుకోవడం మంచిది. కావును అలాంటి వారు క్యాబేజీ సూప్‌ని ప్రయత్నించవచ్చు. శరీరంలో ఉన్న అదనపు కొవ్వును ఈ సూప్‌తో కరిగించవచ్చని అంటున్నారు నిపుణులు.

4 / 5
సొరకాయ సూప్: సొరకాయ అసిడిటీ, అజీర్ణం, అల్సర్, మలబద్ధకాన్ని దూరం చేయడమే కాకుండా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనిలో తక్కువ కేలరీలు ఉంటాయి. త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లాంటివి కూడా తక్కువగా ఉంటాయి.

5 / 5