AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ ఈ గజిబిజీ లైఫ్‌లో ఆరోగ్యంపై చాలా మంది ఫోకస్ పెట్టడం లేదు. అయితే కేవలం మంచి కూరగాయలు, పోషకాలు ఉన్న ఆహారం తింటే సరిపోదు.. వాటిని సరైన పద్ధతిలో వండటం కూడా అంతే ముఖ్యం. మనం రోజు చేసే చిన్న చిన్న పొరపాట్లే మనల్ని హాస్పిటల్ పాలయ్యేలా చేస్తున్నాయి.

వంటింట్లో ఈ చిన్న మార్పులతో మీ గుండె పదిలం.. పొరపాటున ఈ తప్పులు చేశారో ఆస్పత్రికే..
Healthy Cooking Tips
Krishna S
|

Updated on: Jun 28, 2026 | 9:47 AM

Share

ఆ ఆధునిక యుగంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరికీ ఒక సవాల్‌గా మారింది. అయితే మంచి ఆరోగ్యం అనేది కేవలం పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్లే కాదు.. దానిని వండే విధానంపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వంట గదిలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే దీర్ఘకాలంలో గుండె జబ్బులు, బీపీ, ఊబకాయం వంటి ముప్పులకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవితం కోసం వంటింట్లో పాటించాల్సిన కొన్ని కీలకమైన చిట్కాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

స్పూన్‌తో కొలిచి ఆయిల్ వేయండి

చాలామంది వంట చేసేటప్పుడు కొలత లేకుండా నేరుగా ప్యాకెట్ లేదా బాటిల్ నుండి నూనెను పోస్తుంటారు. దీనివల్ల అవసరమైన దానికంటే ఎక్కువ నూనె ఆహారంలో చేరుతుంది. ఫలితంగా శరీరంలో క్యాలరీలు, కొవ్వు పెరిగి ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే వంటలో ఎప్పుడూ స్పూన్ ఉపయోగించి మాత్రమే నూనె కొలిచి వేయడం అలవాటు చేసుకోవాలి.

వేపుళ్లకు దూరంగా ఉండండి

సమోసాలు, పకోడీలు, చిప్స్, పూరీలు వంటి వేయించిన పదార్థాలు నాలుకకు రుచిగా అనిపించినప్పటికీ, వీటిలో ఫ్యాట్, క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల ఊబకాయం,షుగర్, గుండె జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. వేపుళ్లను చాలా అరుదుగా మాత్రమే తీసుకోవాలి. వీటికి బదులుగా రోజువారీ డైట్‌లో తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలను భాగం చేసుకోవాలి.

వండే పద్ధతి మార్చండి

ఆరోగ్యకరమైన జీవనశైలికి వంట వండే పద్ధతి చాలా ముఖ్యం. ఆహారాన్ని డీప్ ఫ్రై చేయడానికి బదులుగా క్రింది పద్ధతులను ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.

ఆవిరిపై: కూరగాయలను ఆవిరిపై ఉడికించడం వల్ల వాటిలోని విటమిన్లు, ఖనిజ లవణాలు వృథా కాకుండా అలాగే ఉంటాయి.

బాయిలింగ్ – గ్రిల్లింగ్: ఉడకబెట్టడం లేదా గ్రిల్, రోస్ట్ చేయడం వల్ల నూనె వినియోగం చాలా తగ్గుతుంది, పైగా ఆహారం రుచిగా ఉంటుంది.

లైట్ సాటే: తక్కువ నూనెతో తేలికగా వేయించడం లేదా ఉడకబెట్టడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.

మరికొన్ని స్మార్ట్ కిచెన్ టిప్స్..

  • ఎల్లప్పుడూ తాజా కూరగాయలు, పదార్ధాలనే వంటకు ఉపయోగించండి.
  • ఆహారాన్ని అమితంగా ఉడికించవద్దు, దీనివల్ల పోషకాలు నశిస్తాయి.
  • వంటల్లో ఉప్పు, చక్కెరల వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించండి.

బయట దొరికే జంక్ ఫుడ్ కంటే ఇంట్లో వండుకునే తాజా భోజనమే ఎల్లప్పుడూ సురక్షితం, పోషకదాయకం. వంటింట్లో మనం తీసుకునే ఇటువంటి చిన్నపాటి జాగ్రత్తలే మనల్ని పెద్ద పెద్ద వ్యాధుల నుండి రక్షిస్తాయి.

Follow Us
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
'మిర్జాపూర్‌' సినిమా చాలా కొత్తగా ఉంటుంది: దివ్యేందు శర్మ
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
పెళ్లయిన 5 నెలలకే 'సాహో' సింగర్ విడాకులు.. భరణం ఎంతంటే?
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
ట్రోల్, డీజిల్‌పై కేంద్రం అప్డేట్.. ట్యాక్స్‌లు మరోసారి పెంపు
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి
చింతూరు ఏజెన్సీలో కలకలం: గొల్లగుప్పలో ముగ్గురు చిన్నారులు మృతి