Asthma Disease: ఉబ్బసం(ఆస్తమా) (Asthma)ఉన్నవారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. వైద్యులు ఆస్తమా పేషెంట్లను ఎల్లప్పుడూ ఇన్‌హేలర్‌ను తీసుకెళ్లాలని సలహా ఇస్తుంటారు. ఎందుకంటే ఆస్తమా ఎప్పుడైనా దాడి చేయవచ్చు. ఇటువంటి పరిస్థితిలో, ఏ ఆహారం, పానీయాలు ఆస్తమాకు ఉపశమనం(Health Tips) ఇస్తాయి, అలాగే ఎలాంటి ఆహారాలు ప్రమాదాన్ని మరింత పెంచుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉబ్బసంలో ఆక్సిజన్ కొరత కూడా ఉండవచ్చు. మీరు ఈ వ్యాధిగ్రస్తులైతే, రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని పెంచడంలో సహాయపడే వాటిని మీ ఆహారం(దానిమ్మ, బీట్‌రూట్ వంటివి.)లో చేర్చుకోండి.
ఆస్తమా రోగులు, ముఖ్యంగా పిల్లలు విటమిన్ డి నుంచి ఉపశమనం పొందవచ్చు. 6 నుంచి 15 సంవత్సరాల పిల్లలకు విటమిన్ డి లోపం ఉండకూడదు. సూర్యకాంతి ఈ పోషకానికి ఉత్తమ మూలం. ఇది కాకుండా, విటమిన్ డి గుడ్లు, సాల్మన్ చేపలు, సోయా పాలు, నారింజ రసం నుంచి పొందవచ్చు.
అలాగే విటమిన్ ఏ కూడా ఆస్తమా దాడుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీంతో ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి. క్యారెట్లు, చిలగడదుంపలు, ఆకుకూరలు విటమిన్ ఏ కు మంచి మూలాంగా పనిచేస్తుంది.
మెగ్నీషియం మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. డార్క్ చాక్లెట్, గుమ్మడి గింజలు, పాలకూర, సాల్మన్ ఫిష్ వంటి వాటిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది.
యాపిల్ పండు తినడం వల్ల ఆస్తమా అటాక్ రిస్క్ తగ్గుతుంది. దీనితో పాటు, పిల్లలలో ఆస్తమా సమస్యను తగ్గించడంలో అరటిపండు సహాయపడుతుంది. అరటిపండులో పొటాషియం ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.
మీకు ఆస్తమా ఉంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండండి..
ఆస్తమా రోగులు బీన్స్, క్యాబేజీ, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వేయించిన ఆహారం, సోడా, శీతల పానీయాలు వంటి అధిక గ్యాస్ ఉత్పత్తి చేసే వాటికి దూరంగా ఉండాలి. కడుపులో ఎక్కువ గ్యాస్ ఏర్పడినప్పుడు, డయాఫ్రాగమ్‌పై ఒత్తిడి ఉంటుంది. అధిక ఆమ్లత్వం ఛాతీ బిగుతు, నొప్పిని పెంచుతుంది. దీంతో ఆస్తమా సమస్యలు తలెత్తుతాయి.
జంక్ ఫుడ్ తినడం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే ప్రమాదం. సల్ఫైట్‌లను కలిగి ఉన్న వాటి నుంచి దూరంగా ఉండాలి. ఇవి ఆస్తమాను ప్రేరేపిస్తాయి. వైన్, ఊరగాయలు, నిమ్మరసం, చెర్రీలు కొన్ని ఉదాహరణలు.
కృత్రిమ స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్‌లు ఆస్తమాను ప్రేరేపిస్తాయి. ఈ రసాయనాలు ఊపిరితిత్తులకే కాదు మొత్తం శరీరానికి హానికరం.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇలాంటి పద్ధతులు/ఆహారం/చిట్కాలు పాటించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోవడం మంచింది.
Also Read: Food Combinations: ఈ ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే మీ ఆరోగ్యానికి ప్రమాదమే.. ఏంటో తెలుసా..
Diabetics: షుగర్ పేషెంట్లు పాలు తాగుతున్నారా.. కచ్చితంగా ఈ 3 విషయాలపై దృష్టి పెట్టండి..!