
వేసవి మొదలైంది. దానితో పాటు అధిక దాహం కారణంగా ప్రజలు ఎక్కువగా, మజ్జిగా, చెరుకు రసం, కొబ్బరి బోండాలు, కూల్‌డ్రింక్స్ వంటివి తాగాలనే కోరిక కూడా పెరిగింది. వేసవిలో గొంతు తడుపుకోవడానికి మనం ఎక్కువగా చల్లగా ఉండే వాటి కోసం చూస్తున్నప్పటికీ, మన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎల్లప్పుడూ పండ్ల రసాలను మాత్రమే తీసుకోవడానికి ప్రయత్నించాలి. మన మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే పోషకమైన, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్ లేని జ్యూస్‌లను తీసుకోవటం మంచిది. అలాంటి వాటిల్లో దానిమ్మ జ్యూస్ ఒక గొప్ప ఎంపిక అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో ఒకటి,రెండు కాదు వందలాది ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన శరీరం, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం-
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే దానిమ్మ జ్యూస్ రక్తపోటును తగ్గిస్తుంది. దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల, దానిమ్మ జ్యూస్ జీర్ణ సమస్యలకు మంచిది. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి దానిమ్మ జ్యూస్ బెస్ట్ ఎంపిక. ఇందులో మీ జీర్ణ ఆరోగ్యాన్ని పెంచడానికి,ప్రేగు వ్యాధి, జీర్ణ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దానిమ్మలోని సమ్మేళనాలు మీ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహిస్తాయి. జీర్ణవ్యవస్థలో మంటను తగ్గిస్తాయి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) ప్రకారం, దానిమ్మలు ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించడానికి లేదా చికిత్స చేయడానికి సహాయపడతాయి. అనేక టెస్ట్-ట్యూబ్ అధ్యయనాల ప్రకారం, దానిమ్మ జ్యూస్‌లో క్యాన్సర్ కణాలను చంపడానికి లేదా శరీరంలో వాటి పెరుగుదలను నెమ్మదింపజేయడానికి సహాయపడే రసాయనాలు ఉంటాయి. అంతేకాదు.. మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. స్ట్రోక్, గుండెపోటు వంటి ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని నివారిస్తుంది. దానిమ్మ జ్యూస్‌లో కాల్షియం, మెగ్నీషియం మరియు విటమిన్ కె పుష్కలంగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మంచిది. దానిమ్మ జ్యూస్‌లో కేలరీలు తక్కువగా ఉండటం వలన బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. 00 గ్రాముల విత్తనాలలో 83 కేలరీలు ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే దానిమ్మ జ్యూస్ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
దానిమ్మ జ్యూస్ దాని శోథ నిరోధక లక్షణాల కారణంగా ఆర్థరైటిస్‌ను నిర్వహించడానికి, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దానిమ్మలో ఉండే మూలకాలు ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమయ్యే ఎంజైమ్‌లను నిరోధిస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..