Garlic Disadvantages: భారతీయ వంటకాలలో వెల్లుల్లి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. కొన్నిసార్లు ప్రజలు దీనిని ఔషధంగా కూడా వినియోగిస్తారు. కరోనా సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి వెల్లుల్లిని విరివిగా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లిలో అల్లిసిన్ ఉంటుంది ఇది ఒక ఔషధం. ఇది యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ ఎ, బి, సి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటాయి. సల్పర్ తగిన మోతాదులో ఉంటుంది. దీని కారణంగా వెల్లుల్లి రుచి, వాసన ఘాటుగా ఉంటాయి. వెల్లుల్లిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కూడా. అది ఎలాగో తెలుసుకుందాం.
1. తలనొప్పిని తీవ్రతరం చేస్తుంది
మీకు తలనొప్పి సమస్య ఉంటే వెల్లుల్లిని తినకూడదు. తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది. చాలా సార్లు తలనొప్పి సమయంలో ప్రజలు వెల్లుల్లిని ఔషధంగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గే బదులు పెరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితిలో వెల్లుల్లిని తీసుకోకుండా ఉండటమే మంచిది.
2. అసిడిటీ సమస్య
ఉదర సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని ఎక్కువగా తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే వెల్లుల్లి ఎసిడిటీ సమస్యని సృష్టిస్తుంది. దీనిని వదిలించుకోవాలంటే వైద్యుల దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు కడుపులో మంటలకు కారణమవుతుంది.
3. నోటి దుర్వాసన
నోటి దుర్వాసన ఉన్నవారు వెల్లుల్లికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది చెడు వాసనని మరింత పెంచుతుంది. దీనివల్ల మీరు తరచుగా ఇబ్బంది పడవలసి ఉంటుంది. అయితే ఈ చెడ్డ వాసనకి పచ్చి కొత్తిమీర నమలడం వల్ల తగ్గించుకోవచ్చు.
4. అలెర్జీలు ఉన్నవారు తినవద్దు
వెల్లుల్లిలో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఇది అలెర్జీలకు కారణమవుతుంది. కాబట్టి శరీరంలో అలర్జీ సమస్యలున్న వారు వెల్లుల్లి వినియోగానికి దూరంగా ఉండాలి. అంతేకాదు వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఒక్కోసారి అలర్జీలు కూడా మొదలవుతాయి. వెల్లుల్లిని పరిమిత పరిమాణంలో తినడం అందరికి మంచిది. ఏదైనా అతిగా తింటే ఉపయోగానికి బదులు హాని తలపెడుతుందని గుర్తుంచుకోండి.