మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..

చలికాలంలో ఖర్జూరాలు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. నెయ్యిలో వేయించిన లేదా కాల్చిన ఖర్జూరాలతో అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలతో తీసుకోవడం ఉత్తమం. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల పురుషులు, మహిళలకు కలిగే ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం..

మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే..
Roasted Dates Benefits

Updated on: Dec 26, 2025 | 9:53 PM

చలికాలం వచ్చిందంటే చాలు.. వాతావరణంలో మార్పుల వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గుతుంటుంది. అందుకే ఈ సీజన్‌లో ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని, శక్తిని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం ఎంతో మేలు. వీటిలో ఖర్జూరాలు అత్యంత కీలకమైనవి. అయితే ఖర్జూరాలను సాధారణంగా తినడం కంటే నెయ్యిలో లేదా నేరుగా వేయించి తినడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

హార్మోన్ల సమతుల్యత.. సంతానోత్పత్తి మెరుగు

ఢిల్లీకి చెందిన ప్రముఖ ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ చంచల్ శర్మ అభిప్రాయం ప్రకారం.. కాల్చిన ఖర్జూరాలు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఖర్జూరాల్లో ఉండే ఐరన్, ఖనిజాలు మహిళల్లో హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తాయి. ఇవి మహిళల్లో అండోత్సర్గము ప్రక్రియ సజావుగా సాగడానికి తోడ్పడతాయి, తద్వారా గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి. పురుషుల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కాల్చిన ఖర్జూరాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇవి స్పెర్మ్ నాణ్యతను పెంచి వంధ్యత్వ సమస్యలను దూరం చేస్తాయి.

ఎప్పుడు, ఎలా తినాలి..?

శరీరం రాత్రిపూట తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు కాల్చిన ఖర్జూరాలను తీసుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్జూరాలను దోరగా వేయించి, గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే పూర్తిస్థాయి పోషకాలు అందుతాయి.

ఇవి కూడా చదవండి

వీరు దూరంగా ఉండాలి..

ఖర్జూరాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, అందరికీ సెట్ కాకపోవచ్చు. డాక్టర్ చంచల్ శర్మ హెచ్చరిక ప్రకారం.. ఈ క్రింది సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది..

  • షుగర్ లెవల్స్ అదుపులో లేని వారు ఖర్జూరాలకు దూరంగా ఉండాలి.
  • లివర్ వ్యాధులు ఉన్నవారు వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి.
  • జీర్ణక్రియ సంబంధిత సమస్యలు లేదా తీవ్రమైన కడుపు నొప్పి ఉన్నప్పుడు వీటిని తీసుకోకూడదు.

చలికాలంలో సహజ సిద్ధంగా లభించే ఈ సూపర్ ఫుడ్‌తో మీ ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..