Maggi with Fanta: పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అన్నారు పెద్దలు.. అందరికి అన్ని రకాల ఆహార పదార్ధాలు నచ్చవు.. అదే విధంగా ఎప్పుడూ ఒకేలా వండితే కూడా ఇంట్లోనే కాదు రోడ్డు సైడ్ ఫుడ్ స్టాల్స్ లోనైనా, రెస్టారెంట్లలోనైనా తినడానికి ఆసక్తిని చూపించారు. దీంతో చాలామంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారాలు తమ బుర్రకు పని చెబుతున్నారు. బిస్కెట్స్ , డ్రింక్స్ వంటి వాటిని ఉపయోగించి మళ్ళీ డిఫరెంట్ కేక్స్ , పకోడీలు వంటి విచిత్రమైన పదార్థాలను తయారు చేస్తున్నారు. తాజాగా ఓ రోడ్డు పక్కన ఫుడ్ స్టాల్ బిజినెస్ చేసే వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంది. లక్షలాది మందిని వీక్షిస్తున్నారు.
ఘజియాబాద్‌కు చెందిన ఒక రోడ్డు పక్కన వ్యాపారి ఈ ఫాంటా మ్యాగీని తయారు చేస్తున్నాడు. తాజాగా ఫుడ్ బ్లాగర్ అమర్ సిరోహి మ్యాగీని తినడానికి ప్రయత్నించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు ఆ వ్యాపారి ఫాంటా మ్యాగీని తయారు చేస్తున్న సమయంలో వీడియో తీసి.. దానిని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లతో పాటు ఫుడ్ లవర్స్ ను ఆకర్షిస్తుంది.
స్ట్రీట్ ఫుడ్ వ్యాపారి ఈ ఫాంటా మ్యాగీని తయారు చేయడానికి ముందుగా బాణలి పెట్టి.. దానిలో కొన్ని కూరగాయలను వేయించాడు. అనంతరం కొంచెం ఫాంటాను వేశాడు. తర్వాత కొన్ని మసాలాలను, మ్యాగీని వేశాడు. తర్వాత మ్యాగీకి కొంత నిమ్మరసం , మరికొంత చాట్ మసాలా జోడించాడు. అంతే ఎంతో రుచికరమైన ఫాంటా మ్యాగీ రెడీ. ఈ ఫాంటా మ్యాగీ ని దాదాపు 6 నెలల నుంచి అమ్ముతున్నట్లు చెప్పాడు. మ్యాగీ ధర రూ. 30 .. ఫాంటా కు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నానని.. బాగా ఆదరణ పొందింది ఈ ఫాంటా మ్యాగీ అంటూ చెప్పాడు.