Eye Sight: ఆరోగ్యకరమైన కంటి చూపు కావాలా? ఈ సలాడ్ ట్రై చేస్తే చాలు..

| Edited By: Anil kumar poka

Jan 19, 2023 | 2:01 PM

వాస్తవానికి కంటి సంబంధిత సమస్యలను నుంచి బయటపడడానికి మంచి ఆహారం తీసుకోవడం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి కంటి చూపు కోసం మంచి ఆహారం తీసుకోవాలని నిపుణుుల సూచిస్తున్నారు.

Eye Sight: ఆరోగ్యకరమైన కంటి చూపు కావాలా? ఈ సలాడ్ ట్రై చేస్తే చాలు..
Eyes (File Pic)
Follow us on

మానవ శరీరంలో కళ్లు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తాయో? అందరికీ తెలుసు. మనం ప్రపంచాన్ని చూడాలంటే కచ్చితంగా కంటి చూపు చాలా అవసరం. కానీ ఎల్లప్పుడూ మొబైల్ లేదా ల్యాప్ టాప్ చూడడం, అర్ధరాత్రి వరకూ టీవీ చూడడం, చెడు ఆహారం, మద్యపాన అలవాటు, పెరుగుతున్న కాలుష్య వాతావరణం ఇవన్నీ కూడా కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చూపు తగ్గడం, కళ్లు మసకబారడం, లాంగ్ లేదా షార్ట్ సైట్, కంటి శుక్లం, కళ్లల్లో నీరు కారడం, కళ్లు ఎర్రబడడం, వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతుంటాం. వాస్తవానికి కంటి సంబంధిత సమస్యలను నుంచి బయటపడడానికి మంచి ఆహారం తీసుకోవడం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి మంచి కంటి చూపు కోసం మంచి ఆహారం తీసుకోవాలని నిపుణుుల సూచిస్తున్నారు. ముఖ్యంగా వివిధ ఆహార పదార్థాలతో సలాడ్ చేసుకుని తింటే కళ్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు వాదన. అలాగే కంటికి మేలు చేసే సలాడ్ ను డైటీషియన్లు వివరిస్తున్నారు. 

సలాడ్ కు కావాల్సిన పదర్థాలు, అవి కంటి ఆరోగ్యాన్ని కాపాడే వివిధ విధులు

ఐస్ బెర్గ్ లాట్యూస్, క్యారెట్, బీట్ రూట్, రెడ్-ఎల్లో బెల్ పెప్పర్, ముల్లంగి, గ్రీన్ బెల్ పెప్పర్ వంటి ఆహార పదార్థాలను సమపాలల్లో వేసి ఓ సలాడ్ లా తయారు చేసుకోవాలి. ఈ సలాడ్ ను ప్రత్యేకంగా తయారు చేసి విరివిగా తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ సలాడ్ తినడం వల్ల ఇందులో ఉన్న విటమిన్ -ఏ, ఈ అలాగే రిబోఫ్లావిన్ వంటివి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యారెట్ వంటి దుంప ఆహారంలో ఉండే ఫైటో కెమికల్స్ కంటి శుక్లం సమస్య రాకుండా సాయం చేస్తుంది. అలాగే ఈ సలాడ్ లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విటమిన్లు సి, ఈలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇన్ని పోషకాలు ఉండడం వల్ల ప్రీ రాడికల్స్ మీ కళ్లను దెబ్బతినకుండా కళ్లను రక్షిస్తాయి. అలాగే ఇప్పటికే మీ కళ్లకు జరిగిన డ్యామేజ్ ను ఈ సలాడ్ ను విరివిగా తీసుకోవడం సరి చేస్తాయి. కాబట్టి కంటి రక్షణకు నిపుణులు సూచించిన సలాడ్ ను తినాల్సిందే..!

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..