Fish Fry Recipe: ఆదివారం స్పెషల్.. ఈజీగా టేస్టీగా చేపల వేపుడు తయారీ విధానం మీ కోసం..

|

Jul 10, 2022 | 8:30 PM

చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి. ఈ రోజు ఈజీగా టేస్టీగా చేప‌ల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం.. 

Fish Fry Recipe: ఆదివారం స్పెషల్.. ఈజీగా టేస్టీగా చేపల వేపుడు తయారీ విధానం మీ కోసం..
Fish Fry Recipe
Follow us on

Fish Fry Recipe: సీఫుడ్ లో చేపలు, రొయ్యలు, పీతలు ఇలా అనేక రకాలున్నాయి. కానీ వీటన్నిటిలోనూ చేపలు వెరీ వెరీ స్పెషల్. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ చేపల్లో ఉన్నాయి. వీటిని ఆహారంగా తినడం వలన శరీరానికి కావాల్సిన ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. చేపలతో చేపల పులుసు, కూర, వేపుడు వంటి రకరకాల ఆహారపదార్దాలను తయారు చేస్తారు. చేప‌ల‌తో చేసే వంట‌కాల‌లో చేప‌ల వేపుడు కూడా ఒక‌టి. ఈ రోజు ఈజీగా టేస్టీగా చేప‌ల వేపుడుతయారు చేసుకోవడం ఎలా తెలుసుకుందాం..

త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు: 
వేపుడుకి కావల్సిన చేప ముక్కలు: 6
కోడి గుడ్డు : ఒక
గరం మసాలా పొడి: అర టీ స్పూన్
జీలకర్ర పొడి : ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్:
కార్న్ ప్లోర్ : టీ స్పూన్
కారం : టీ స్పున్
పసుపు: పావు టీ స్పూన్,
నిమ్మర‌సం : 2 టీ స్పూన్స్,
ఉప్పు : రుచికి సరిపడా
త‌రిగిన కొత్తిమీర
త‌రిగిన క‌రివేపాకు
నూనె: వేయించడానికి సరిపడా

త‌యారీ విధానం: చేప ముక్కలను తీసుకుని శుభ్రంగా క‌డిగి.. ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అనంతరం చేప ముక్కల్లో నిమ్మరసం, ఉప్పు,పసుపు వేసి.. కొంచెం సేపు పక్కకు పెట్టాలి.. తర్వాత కార్న్ ప్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, జీలకర్ర,గరం మసాలా, కొత్తిమీర, కర్వేపాకు వేసి చేపల ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఈ చేపల ముక్కలను ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అలా చేపలను అరగంట సేపు చేపల ముక్కలను ఫ్రిజ్ లో పెట్టుకున్న తర్వాత.. తీసుకుని బయట పెట్టుకోవాలి. అనంతరం గ్యాస్ స్టౌ వెలిగించి.. లోతులేని అడుగు మందంగా ఉండే కళాయిని పెట్టుకుని.. నూనె వేసుకోవాలి. నూనె వేడి ఎక్కిన తర్వాత చేప ముక్కలను వేసి.. చిన్న మంటమీద రెండు వైపులా తిప్పుతూ వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా చేప ముక్కలు ఎర్రగా అయ్యే వరకూ వేయించుకుని ఒక ప్లేట్ తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీగా ఉండే చేపల వేపుడు రెడీ.. గార్నిష్ కోసం క్వాలిసిన వారు జీడిపప్పు వేయించుకుని పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..