Kerala Fish Molee Curry: కేరళ స్టైల్ లో కొబ్బరి పాలతో రుచికరమైన చేపల కూర తయారీ విధానం..

|

Jul 25, 2021 | 3:54 PM

Kerala Fish Molee Curry: దక్షిణ భారత దేశంలో పర్యాటకులను ఆకర్శించే ప్రాంతం కేరళ. పచ్చదనం, ప్రకృతి, జలపాతాలు, నదులు, సముద్రం ఇవన్నీ కేరళకు ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చాయి..

Kerala Fish Molee Curry: కేరళ స్టైల్ లో కొబ్బరి పాలతో రుచికరమైన చేపల కూర తయారీ విధానం..
Kerala Fish Curry
Follow us on

Kerala Fish Molee Curry: దక్షిణ భారత దేశంలో పర్యాటకులను ఆకర్శించే ప్రాంతం కేరళ. పచ్చదనం, ప్రకృతి, జలపాతాలు, నదులు, సముద్రం ఇవన్నీ కేరళకు ఎంతో ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఇక కేరళకు మరింత స్పెషాలిటీ తీసుకొచ్చిన వంటలు గురించి ఎంత చెప్పినా తక్కువే.. స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో చేసే వంటలు ప్రసిద్ధిగాంచాయి. ఈరోజు కేరళ స్టైల్ లో కొబ్బరి పాలతో చేపల కూర తయారీ గురించి తెలుసుకుందాం..

చేపల కూర తయారీకి కావలసిన పదార్ధాలు:

చేప ముక్కలు – 500 గ్రాములు
కార్న్ ప్లోర్ -ఒక టేబుల్ స్పూన్
టమాటో -రెండు (చిన్నగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
పచ్చి మిర్చి – 2, 3 రెండుగా చీల్చినవి
మిరియాల పొడి – అర స్పూన్
అల్లం -చిన్న ముక్క
వెల్లుల్లి రేకలు
పసుపు టేబుల్ స్పూన్
నూనె (ఇష్టమైనవారు స్వచ్ఛమైన కొబ్బరి నూనె లేకపోతె వేరుశనగ నూనె)
ధనియాల పొడి – రెండున్నర టేబుల్ స్పూన్లు
మెంతి పొడి – కొంచెం
కొబ్బరి పాలు – ఒక కప్పు
ఉప్పు -రుచికిసరిపడా
కొత్తిమిర – చిన్నగా కట్ చేసుకోవాలి

తయారీ విధానం :

ముందుగా చేప ముక్కలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత చేప ముక్కలకు ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి. వారిని కలిపి.. ఆ చేప ముక్కలను 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి.
అరగంట తర్వాత స్టౌ వెలిగించి బాండీ పెట్టుకుని నూనె వేసుకుని మిరియాల పొడిలో నానిన చేపముక్కలను వేయించి పక్కకు పెట్టుకోవాలి. అనంతరం అదే ప్యాన్ లో కూరకు సరిపడా ఆయిల్ వేసి.. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , అల్లం, వెల్లుల్లి వేసి వేయించాలి. తర్వాత పసుపు, ధనియాల పొడి, మెంతి పొడి వేసి కొంచెం సేపు ఉల్లిపాయలను మగ్గనివ్వాలి. అనంతరం ఉల్లిపాయల మిశ్రమంలో కొబ్బరి పాలు కొంచెం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుని కలపాలి. కొంచెం వేడి ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, కొబ్బరిపాలు మిశ్రమంలో వేయించి పక్కకు పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుని ఉడికించుకోవాలి. అలా ఒక 15 నిమిషాలు ఉడికిన తర్వాత మిగిలిన కొబ్బరిపాలల్లో కార్న్ ప్లోర్ కలిపి ఉడుకుతున్న కూరలో వేసి.. ఒక పదినిమిషాలు ఉడికించి చివరిగా కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన కేరళ స్టైల్ లో కొబ్బరిపాలతో చేపల కూర రెడీ

Also Balakrishna: వరస సినిమాలతో బాలయ్య బిజిబిజీ … అనిల్ రావిపూడితో సినిమా లేట్ అయ్యే ఛాన్స్