
నాన్ వెజ్ ప్రియులు చికెన్, మటన్, చేపలను ఇష్టంగా తింటారు. అయితే, చేపలు తిన్న తర్వాత కొన్ని పదార్థాలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.. చేపలు ఒకటే కాకుండా.. ఆహార కలయికలకు సంబంధించి సమాజంలో అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. తరచుగా వినిపించే అనేక అపోహలలో ఒకటి చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదనే నమ్మకం. దీనిని చాలామంది తూచాతప్పకుండా పాటిస్తూ ఉంటారు. అయితే.. చేపలు కూర తిన్న తర్వాత పెరుగు తినే విషయంలో అనేక విధాలుగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఆయుర్వేద నిపుణులు మాత్రం చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినొద్దని సూచిస్తున్నారు.
చేపలు, పెరుగు రెండింటిలోనూ అధిక ప్రోటీన్లు ఉంటాయి. వీటిని ఒకేసారి జీర్ణం చేసుకోవడం కడుపుకు కాస్త భారంగా మారుతుంది. చేపల కూర తిన్న వెంటనే పెరుగు తింటే జీర్ణవ్యవస్థ ప్రభావితం అవుతుందని పేర్కొంటున్నారు. జీర్ణవ్యవస్థపై భారం పడి కడుపు ఉబ్బరం, గ్యాస్, లేదా అజీర్ణం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం ప్రకారం చేప శరీరంలో వేడిని పుట్టిస్తే, పెరుగు చలువ చేస్తుంది. అయితే, ఇలా తింటే అనేక సమస్యలు వస్తాయని పేర్కొంటున్నారు.
చేపలు, పెరుగు తీసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిదంటున్నారు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినాలంటే కనీసం 2-3 గంటల వ్యవధి ఉండేలా చూసుకోవడం మంచిదని చెబుతున్నారు.
అయితే.. మీకు పాల ఉత్పత్తుల వల్ల గానీ, చేపల వల్ల గానీ అలెర్జీలు ఉంటే ఈ రెండు కలిపి తీసుకోవడం అస్సలు మంచిది కాదని సూచిస్తున్నారు. ఇది అందరికీ జరగదని.. శరీరతత్వాన్ని బట్టి సమస్యలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
ఆధునిక వైద్యం ప్రకారం చేపలు, పెరుగు.. ఈ కాంబినేషన్ హానికరం అని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు లేవు.. కానీ.. పాల ఉత్పత్తులు లేదా సీ-ఫుడ్ అలర్జీ ఉంటే మాత్రం ఈ కలయికను పూర్తిగా దూరం పెట్టడం సురక్షితమని పేర్కొంటున్నారు.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా.. సందేహాలు ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..