AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg Pulao Recipe: వహ్వా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!

ప్రతిరోజూ ఒకే రకమైన అన్నం, కూరలు తిని బోర్ కొడుతుంటే ఈ ఎగ్ పులావ్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. తక్కువ సమయంలోనే సువాసనభరితంగా, రెస్టారెంట్ స్టైల్ రుచితో ఈ పులావ్ సిద్ధమవుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ వంటకం లంచ్ బాక్స్‌కైనా, వీకెండ్ స్పెషల్‌కైనా అద్భుతమైన ఎంపిక. ఎలా వండాలో చూసేయండి..

Egg Pulao Recipe: వహ్వా.. ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పులావ్.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ అడుగుతారు!
Easy Egg Pulao Recipe
Bhavani
|

Updated on: Aug 03, 2026 | 6:15 PM

Share

చల్లటి వెదర్ లో పొద్దున వండిన వంటనే మళ్లీ మళ్లీ తినాలంటే ఎవరికి బోర్ కొట్టదు. అందుకే ఒక కమ్మటి ఎగ్ రెసిపీ ఇది. ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొద్ది పదార్థాలతోనే ఈ రెసిపీ తయారు చేయవచ్చు. బాస్మతి బియ్యం, ఉడికించిన గుడ్లు, కొన్ని సుగంధ ద్రవ్యాలు ఉంటే చాలు.. నోరూరించే ఎగ్ పులావ్ రెడీ అయిపోతుంది.

కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం – 1 కప్పు

గుడ్లు – 4ఉల్లిపాయ – 2 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి – 3

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్

పెరుగు – 2 టేబుల్ స్పూన్లు

పుదీనా ఆకులు – కొద్దిగా

కొత్తిమీర – కొద్దిగా

దాల్చిన చెక్క – 1 ముక్క

లవంగాలు – 3

యాలకులు – 2

బిర్యానీ ఆకు – 1

జీలకర్ర – అర టీస్పూన్

గరం మసాలా – 1 టీస్పూన్

మిరపకారం – 1 టీస్పూన్

పసుపు – చిటికెడు

నెయ్యి లేదా నూనె – 2 టేబుల్ స్పూన్లు

ఉప్పు – తగినంత

నీరు – 2 కప్పులు

తయారీ విధానం

1. ముందుగా బియ్యం సిద్ధం చేసుకోండి బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నుంచి 30 నిమిషాలు నానబెట్టండి. మరోవైపు గుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టండి.

2. మసాలా వేయించండి కుక్కర్ లేదా మందపాటి పాత్రలో నెయ్యి లేదా నూనె వేసి జీలకర్ర, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

3. మసాలా సిద్ధం చేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేయించాలి. తర్వాత పెరుగు, పసుపు, మిరపకారం, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా పుదీనా, కొత్తిమీర వేయాలి.

4. గుడ్లు, బియ్యం కలపండి ఉడికించిన గుడ్లకు చిన్న చిన్న గాట్లు పెట్టి మసాలాలో వేసి రెండు నిమిషాలు కలపాలి. తర్వాత నానబెట్టిన బియ్యం వేసి మెల్లగా కలిపి అవసరమైన నీరు పోయాలి.

5. దమ్‌లో ఉడికిస్తే రుచి మరింత పెరుగుతుంది పాత్రకు మూతపెట్టి తక్కువ మంటపై అన్నం పూర్తిగా ఉడికే వరకు వండాలి. చివరగా మరో ఐదు నిమిషాలు దమ్‌లో ఉంచితే ఎగ్ పులావ్‌కు అద్భుతమైన వాసన, రుచి వస్తుంది. పెరుగు రాయితాతో వేడివేడిగా వడ్డిస్తే మరింత రుచిగా ఉంటుంది.

Follow Us