Banana Side Effects: అరటితో కూడా ఆరోగ్య సమస్యలే..! వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..

|

Feb 17, 2023 | 6:59 PM

అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. రోజు రెండు అరటిపండ్లకు మించి తింటే బరువు వేగంగా పెరుగుతారు. అంతే కాదు..

Banana Side Effects: అరటితో కూడా ఆరోగ్య సమస్యలే..! వివరాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
Banana Side Effects
Follow us on

అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించే అరటి ఒక సూపర్ ఫుడ్ కూడా. అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందడమేకాక రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. అందుకు అరటిపండులో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, చక్కెర, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండడమే కారణం. జీర్ణక్రియలో ముఖ్యమైన పాత్ర పోషించే అరటి పండు పేగు కదలికలని కూడా నియంత్రిస్తుంది. ఎన్నో పోషక గుణాలు కలిగిన అరటి పండు ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో..  అతిగా తింటే అంతకు మించిన ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఎందుకంటే.. అరటిపండులో దాదాపు 100 కేలరీలు ఉంటాయి. రోజు రెండు అరటిపండ్లకు మించి తింటే బరువు వేగంగా పెరుగుతారు. అంతే కాదు ఇందులో లభించే పొటాషియం పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ పొటాషియం తీసుకుంటే మైకం, వాంతులు, పల్స్ రేటు పెరగుతుంది. ఇది హైపర్ కలేమియా లక్షణం. ఒక్కోసారి గుండె పోటుకు కూడా కారణమవుతుంది.

అతిగా అరటిపండు తింటే వచ్చే నష్టాలు

  1. అరటిపండ్లు అతిగా తినడం వల్ల దంతాల్లో పుచ్చు ఏర్పడుతుందని పలు పరిశోధనలో తేలింది. ఇందులో స్టార్చ్ ఉంటుంది. ఇది దంతల మధ్య సులభంగా అంటుకుంటుంది. అందుకే అరటిపండు తిన్న రెండు గంటల్లోపు దంతాలు శుభ్రం చేసుకోవాలి.
  2. అరటిలో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే నరాలు దెబ్బతింటాయి. బాడీ బిల్డింగ్ కోసం అరటిపండ్లు ఎక్కువగా తినే వారికి ఈ సమస్య రావచ్చు.
  3. పచ్చి అరటిపండ్లలో స్టార్చ్ ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దీనిని రోజూ తీసుకుంటే గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. పండిన అరటిపండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకి మంచిది. తక్కువ నీటిని కలిగి ఉంటాయి. కానీ అతిగా తింటే మాత్రం మలబద్ధకాన్ని తీసుకొస్తుంది.
  4. అరటి పండ్లను ఎక్కువగా తీసుకుంటే అందులోని ఫ్రక్టోజ్‌.. రక్తంలో చక్కెర స్థాయి పెరిగేలా చేస్తుంది. అందుకే మధుమేహం ఉన్న వాళ్ళు వీటిని వైద్యులను సంప్రదించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి.
  5. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే పొటాషియం అధికంగా ఆహారాన్ని తీసుకోవద్దని వైద్యులు సలహా ఇస్తారు. అందువల్ల అటువంటి వాళ్ళు అరటిపండుని దూరం పెట్టాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…