Foods For Healthy Bones: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే..!

|

Oct 17, 2021 | 4:19 PM

Health Care Tips: మన శరీరం మొత్తం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉందనే సంగతి తెలిసిందే. అందుకే వాటిని బలంగా ఉంచడం ఎంతో ముఖ్యం. మీ ఎముకలు దృఢంగా ఉండటానికి ఎలాంటి పదార్ధాలు తినాలో ఇప్పుడు చూద్దాం.

Foods For Healthy Bones: ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి కచ్చితంగా తినాల్సిందే..!
Egg
Follow us on

Bone Health: ఆరోగ్యకరమైన జీవితానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం ఎంతో ముఖ్యం. దీని కోసం కండరాలు, ఎముకలు కూడా ఎంతో బలంగా ఉండడం ముఖ్యం. ఎముకలు శరీర ఆకారానికే కాకుండా ఎన్నో ముఖ్యమైన అవయవాలను కాపాడుతుంటాయి. అదే సమయంలో మన శరీరం మొత్తం ఎముకల నిర్మాణంపై ఆధారపడి ఉంటుందని మనకు తెలిసిందే. అందుకే వాటిని బలంగా ఉంచడం ఎంతో ముఖ్యం. ఎముకలు క్షీణించడం, పెళుసుగా ఉండటం వల్ల ఎముక క్యాన్సర్, రికెట్స్ వంటి వ్యాధులు వస్తాయని తెలిసిందే. అందుకే ఎముకలు దృఢంగా ఉండాలంటే ఎలాంటి పదార్ధాలు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాల్షియం లోపాన్ని అధిగమించేందుకు పాలు: పాలను సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. పాలు తాగడానికి ఇష్టపడకపోతే అల్పాహారంలో ఓట్స్‌తో పాటు పాలు కలిపి తీసుకోవచ్చు. రోజూ పాలు తీసుకుంటే మీకు కాల్షియం మూడింట ఒక వంతు లభిస్తుంది.

గుడ్లు: గుడ్లలో ప్రోటీన్ తగినంత పరిమాణంలో ఉంటుంది. శరీరంలో తక్కువ స్థాయి ప్రోటీన్ ఎముకల పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. అందువల్ల మీ ఆహారంలో గుడ్లను చేర్చడం వల్ల ఆరోగ్యకరమైన ప్రొటీన్లు అంది ఎముకలు దృఢంగా మారేందుకు సహాయపడుతుంది. ఉడకబెట్టిన గుడ్లను తినలేకపోతే, వేయించడం లేదా ఆమ్లెట్‌లాగా వేసుకుని కూడా తినవచ్చు.

డ్రై ఫ్రూట్స్‌తో ఎముకలు బలోపేతం: ఎముకల ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్‌ ఎంతో ఉపయోగపడతాయి. ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి వాల్‌నట్స్, జీడిపప్పు, బాదం తీసుకోవాలి. వీటిని ప్రతిరోజూ కొన్ని చొప్పును తీసుకుంటే ఎముకల బలంగా తయారవడంలో ఎంతో సహాయపడతాయి.

Also Read: ఈ లక్షణాలు మీలో ఉంటే చాలా ప్రమాదం..! చికిత్స తీసుకోకపోతే అంతే సంగతులు

Praising Children: పిల్లలను అతిగా ప్రశంసిస్తున్నారా..? అయితే జాగ్రత్త.. తాజా పరిశోధనలో కీలక విషయాలు..!

Ayurvedic Tips: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా.. ఆయుర్వేద పద్ధతులతో ఇలా చేయండి చాలు..