Protein Foods: సంపూర్ణమైన ఆహారం కోసం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్, కార్బ్స్, కేలరీలు.. ఇలా అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా శరీరానికి శక్తిని అందించే ప్రొటీన్స్ ఏ మాత్రం తగ్గకూడదు. ఇక ప్రోటీన్స్ అనే మాట ప్రస్తావనకు వచ్చిందంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది గుడ్డు మాత్రమే. గుడ్డులో ప్రొటీన్ కంటెంట్ అధికం. అందుకే డైటీషియన్లు, ఫిట్‌నెస్ నిపుణులు గుడ్లను తినాలని సిఫార్సు చేస్తారు. అయితే కొందరికి గుడ్లను తీసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటివారు ప్రొటీన్ల కోసం ఏ ఆహారం తీసుకోవాలో తెలియక ఈ పోషకాన్ని తీసుకోవడమే మానేస్తారు. అయితే ప్రొటీన్ కోసం గుడ్లనే కాక ఇతర ఆహారాలను కూడా తీసుకోవచ్చు. వాటిల్లో కూడా ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
శనగలు: ప్రొటీన్‌కి శనగలు మంచి ఆహార ఎంపిక. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఎక్కువగా ఉపయోగించే శనగలను ఉడకబెట్టి కూడా తీసుకోవచ్చు. నిపుణుల ప్రకారం 100 గ్రాముల శనగలలో 19 గ్రాముల వరకు ప్రొటీన్ ఉంటుంది.
పనీర్: శాఖాహారుల ఆహారంలో భాగమైన పనీర్ కూడా ప్రొటీన్‌కి మంచి ఎంపిక. పనీర్‌లో ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్, విమమిన్లు అధికంగా ఉంటాయి. 100 గ్రాముల పనీర్‌లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గుమ్మడికాయ గింజలు: 100 గ్రాముల గుమ్మడి గింజలు 19 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇంకా ఇందులో ఫైబర్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్ కె, పొటాషియం, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉంటాయి.
గ్రీక్ పెరుగు: గ్రీకు పెరుగులో సాధారణ పెరుగుకు కంటే ప్రోటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల గ్రీక్ పెరుగులో ఏకంగా 23 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
సోయాబీన్స్: 100 గ్రాముల సోయాబీన్స్‌లో 29 గ్రాముల ప్రొటీన్ కంటెంట్ ఉంటుందంట. ఇంకా సోయా బీన్స్‌లో శరీరానికి అవసరమైన అనేక రకాల మినరల్స్, విటమిన్స్ ఉంటాయి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..