Does Meat Cause Diabetes : టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు సమతుల్య ఆహారం తినమని, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెరలను తగ్గించమని వైద్యులు సూచిస్తారు. అయితే మాంసం తింటే మధుమేహం వస్తుందా అనే దానిపై పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.. సహజంగా మాంసం పిండి పదార్థం లేని ఫుడ్. కొన్ని రకాల మాంసం తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
2018 లో డయాబెటిస్ కేర్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ఓపెన్-ఫ్లేమ్, అధిక-ఉష్ణోగ్రత పద్ధతులను ఉపయోగించి వండిన మాంసం తింటే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించింది.పెద్ద మంట మీద వండిన ఎర్ర మాంసం, చికెన్ తింటే డయాబెటిస్ వచ్చే ఉన్నాయని వెల్లడించారు. ఉదాహరణకు.. బార్బెక్యూయింగ్, బ్రాయిలింగ్, గ్రిల్లింగ్, వేయించే పద్దతుల్లో వండిన మాంసం తింటే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఈ పద్ధతిలో వండిన మాంసాలలో హెటెరోసైక్లిక్ అమైన్స్ (హెచ్‌సిఎ) అధిక స్థాయిలో ఉంటాయి. మాంసాలలో ఉండే ప్రోటీన్లు, చక్కెరలు అధిక ఉష్ణోగ్రతలతో ప్రతిస్పందించినప్పుడు ఇవి ఏర్పడతాయి. బాగా చేసిన మాంసాలలో అత్యధిక హెచ్‌సిఎ స్థాయిలు ఉంటాయి. పరిశోధకులు వీటిని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (PAH లు) అని పిలుస్తున్నారు.
ఈ సమ్మేళనాలను జంతు అధ్యయనాలలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచేలా ఉన్నాయని నేషనల్ క్యాన్సర్ ఇన్సిట్యూట్ పరిశోధకులు నివేదించారు.
2015 సమీక్ష ప్రకారం.. ప్రాసెస్ మాంసాహారం వల్ల కూడా మధుమేహం ప్రమాదం ఉందని గుర్తించారు. ప్రాసెస్ చేసిన మాంసాలకు ఉదాహరణలు.. సాసేజ్‌లు, కోల్డ్ కట్స్, ఉప్పుతో చేసిన మాంసాలు తదితర వస్తాయి.
మాంసం అధిక స్థాయి సంతృప్త కొవ్వులు, కేలరీలు కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో పోలిస్తే, మాంసంలో ఎక్కువ కేలరీలు, కొవ్వులు ఉంటాయి. అయితే ఎక్కువగా మాంసం తినడం వల్ల ఉదర కొవ్వు పెరుగుతుంది. దీంతో మధుమేహ ప్రమాదం ఎక్కువగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఊబకాయం, అధిక బరువుతో డయాబెటిస్ ముడిపడి ఉన్నందున, మాంసాలలో కనిపించే సంతృప్త కొవ్వు, ముఖ్యంగా ఎర్ర మాంసాలు డయాబెటిస్ ప్రమాదానికి దోహదం చేస్తాయని వైద్యులు నిర్ధారించారు.
Also Read : మాస్కులు ధరించనందుకు 22 లక్షల మందికి జరిమానా.. 44 కోట్ల రూపాయలు వసూలు చేసిన బీఎంసీ..
Telangana Budget: వారి చూపంతా అసెంబ్లీవైపే.. ఆ విషయంలో సీఎం కేసీఆర్ ప్రకటనటపై ఉత్కంఠ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. హోళీ పండుగ గిఫ్ట్‌గా రూ. 10 వేలు.. వివరాలివే.!