Potato Peel Benefits: బంగాళదుంప తొక్కల్ని పాడేస్తున్నారా… అందులో ఆరోగ్యం దాగి ఉంది తెలుసా..?!

|

Jan 23, 2024 | 4:03 PM

కొంతమందికి బంగాళాదుంపలంటే చాలా ఇష్టం.. అలాంటి వారు ఏది వండినా దానికి చిన్న బంగాళాదుంప ముక్కను కలుపుతారు. సాధారణంగా మనం బంగాళదుంపలు వండేటప్పుడు పై తొక్క తీసి పారేస్తాం కదా? కానీ, బంగాళాదుంప తొక్కలలో ఉండే పోషకాల గురించి మీకు తెలియకపోవడమే దీనికి కారణం. కానీ, బంగాళాదుంప తొక్క కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Potato Peel Benefits: బంగాళదుంప తొక్కల్ని పాడేస్తున్నారా... అందులో ఆరోగ్యం దాగి ఉంది తెలుసా..?!
Potato Peel
Follow us on

Potato Peel Benefits: బంగాళాదుంప పీల్ ప్రయోజనాలు: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన కూరగాయ బంగాళదుంప.. అదే ఆలుగడ్డ.. బంగాళాదుంపను సాధారణంగా కూరగాయలలో రాజుగా పిలుస్తారు. ఎందుకంటే దీనిని ఏ కూరగాయతోనైనా జత చేసి వండుకునే వెసులుబాటు ఉంటుంది.. బంగాళదుంపలతో మనం ఎన్నో రకాల వెరైటీలను తయారు చేసుకోవచ్చు. ఇందులో చాట్, టిక్కీ, ఆలూ బజ్జీలు మరెన్నో ఉన్నాయి. కొంతమందికి బంగాళాదుంపలంటే చాలా ఇష్టం.. అలాంటి వారు ఏది వండినా దానికి చిన్న బంగాళాదుంప ముక్కను కలుపుతారు. సాధారణంగా మనం బంగాళదుంపలు వండేటప్పుడు పై తొక్క తీసి పారేస్తాం కదా? కానీ, బంగాళాదుంప తొక్కలలో ఉండే పోషకాల గురించి మీకు తెలియకపోవడమే దీనికి కారణం. కానీ, బంగాళాదుంప తొక్క కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

బంగాళాదుంప తొక్కల నుండి పోషకాలు..

బంగాళదుంప తొక్క పోషకాల నిల్వ. ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇదీ కాకుండా బంగాళాదుంప తొక్కలో విటమిన్ B3 కూడా ఉంటుంది. బంగాళదుంప తొక్క వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి…

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం కోసం ..

బంగాళాదుంప తొక్క మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం సహాయంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రస్తుతం హృద్రోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న భారతదేశంలో, బంగాళాదుంప తొక్క చాలా మందికి ఉపయోగపడుతుంది.

క్యాన్సర్‌ను నివారిస్తుంది..

బంగాళదుంప తొక్కలో ఫైటోకెమికల్స్ ఉంటాయి. అవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. దీనితో పాటు, క్లోరోజెనిక్ ఆమ్లం కూడా ఈ తొక్కలలో ఉంటుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గిస్తుంది.

ఎముకలను బలోపేతం చేస్తుంది..

బంగాళాదుంప తొక్కలు కాల్షియం వంటి అనేక ముఖ్యమైన ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి సహజంగా ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..